శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 21 మే 2018 (20:28 IST)

నేను చేసిన అతిపెద్ద పొర‌బాటు అదే అంటోన్న‌ శ‌ర్వానంద్‌..!

విభిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ... వ‌రుస విజ‌యాలు సాధిస్తూ... కెరీర్లో దూసుకెళుతోన్న‌ యంగ్ హీరో శ‌ర్వానంద్‌. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడు హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్‌లో `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` సినిమా చేస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో హీరోయిన్‌. ఇప

విభిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ... వ‌రుస విజ‌యాలు సాధిస్తూ... కెరీర్లో దూసుకెళుతోన్న‌ యంగ్ హీరో శ‌ర్వానంద్‌. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడు హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్‌లో `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` సినిమా చేస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో హీరోయిన్‌. ఇప్పుడు వ‌రుస విజ‌యాలు అందుకుంటున్న‌ప్ప‌టికీ కెరీర్ తొలినాళ్ల‌లో శ‌ర్వానంద్ చాలా ఇబ్బందులు ప‌డిన సంగ‌తి తెలిసిందే.
 
తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో శ‌ర్వానంద్ మాట్లాడాడు. `నా కెరీర్‌లో నేను చేసిన అతి పెద్ద పొర‌బాటు నిర్మాత‌గా మార‌డం. `కో అంటే కోటి` సినిమాను నిర్మించాల‌నుకోవ‌డం నేను తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యం. మితిమీరిన ఆత్మ‌విశ్వాసం కార‌ణంగానే ఆ త‌ప్పు చేశాను. అప్ప‌టివ‌ర‌కు సంపాదించిన‌దంతా ఆ సినిమాలో పెట్టేశాను. ఆ సినిమా చాలా పెద్ద ఫ్లాప్‌. ఆర్థిక ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్క‌డానికి మూడేళ్లు ప‌ట్టింది. అది నాకెప్ప‌టికీ ఓ గుణ‌పాఠ‌మే అని చెప్పాడు శ‌ర్వ‌నాంద్.