మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (17:56 IST)

అందుకే మ‌డ్డి సినిమాను రిలీజ్ చేస్తున్నా - దిల్‌రాజు

Dilraju, Dr. Praga bhal
భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రై.లి ప‌తాకంపై డిసెంబ‌ర్‌10న దిల్‌రాజు భారీగా విడుద‌ల‌చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభ‌రితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి దిల్‌రాజు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..
 
దిల్‌రాజు మాట్లాడుతూ - ``మ‌డ్డి సినిమా మేకింగ్ వీడియోలు మ‌రియు టీజ‌ర్, ట్రైల‌ర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న మ‌డ్డి అన్ని భాష‌ల్లో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు డా. ప్ర‌గ‌భ‌ల్ మాట్లాడుతూ, ఒక యూనిక్ మూవీని ప్రేక్ష‌కులకు అందించాల‌ని మా టీమ్ అంద‌రం ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ మూవీని తెర‌కెక్కించాం. ఆఫ్ రోడ్ మ‌డ్ రేస్ అనేది భార‌త‌దేశంలో కొత్త కానెప్ట్ కాబ‌ట్టి ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఈ మూడు స్టేజెస్‌లో చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఈ క‌థ‌కి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ‌డం జ‌రిగింది.   కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధిస్తుంది`` అన్నారు
 
యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.