మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:08 IST)

`దేశ‌ముదురు` క‌థ నాకే చెప్పారు. కానీ సూటుకాద‌ని చెప్పాః హీరో సుమంత్

Sumanth new photo
`సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `క‌ప‌ట‌ధారి`.  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో  క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మించారు. ఫిబ్రవరి 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ నిర్మొహ‌మాటంగా ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

- యాక్ట‌ర్‌గా చాలా క‌థ‌లు వింటుంటాను. అయితే అన్ని క‌థ‌లకు నేను సూట్ అవుతాన‌ని అనుకోను. నెరేష‌న్ తొలి అర్థ‌గంటలోనే సినిమా నాకు సూట్ అవుతుందో లేదో క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఒక‌వేళ నాకు ఆ క‌థ సూట్ కాక‌పోతే, ఎవ‌రికి ఆ క‌థ సూట్ అవుతుందో వారి ద‌గ్గ‌ర‌కి నేను ఆ క‌థ‌ను విన‌మ‌ని పంపిస్తాను. పూరీజ‌గ‌న్నాథ్‌గారు `దేశ‌ముదురు` క‌థ నాకే చెప్పారు. కానీ నాకు సూటుకాద‌ని చెప్పేశాను. నిజాయితీకి మెచ్చుకున్నారు. నాకు ఏది సూట‌యితే అదే చేస్తాను. మొహ‌మాటానికి పోతే దెబ్బ‌తింటాం. 
 
- ‘మ‌ళ్లీరావా’ హిట్ అయిన త‌ర్వాత నాకు రొమాంటిక్ డ్రామా సినిమాలే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అనుకున్నాను. కానీ ఎక్కువగా థ్రిల్ల‌ర్ సినిమాలే వ‌చ్చాయి. ఆడియెన్‌గా నాకు కూడా  థ్రిల్ల‌ర్ సినిమాలే ఎక్కువ‌గా న‌చ్చుతాయి. అందుక‌నే ఏమో రీసెంట్ టైమ్‌లో ఎక్కువ‌గా థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాను. ‘క‌ప‌ట‌ధారి’ విష‌యానికి వ‌స్తే.. నేను చేసిన థ్రిల్ల‌ర్స్ కంటే ఇది చాలా డిఫ‌రెంట్ మూవీ ‘కపటధారి’. సినిమాలో ఓ డిఫ‌రెంట్ మూడ్ క్యారీ అవుతుంది. క‌న్న‌డ సినిమా ‘కావ‌లుధారి’ చూశాను. సాధార‌ణంగా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేట‌ప్పుడు ఇలా షూట్ చేస్తార‌ని కూడా అనుకోలేదు. చాలా సింపుల్‌గా, డిఫ‌రెంట్‌గా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం ఆ సినిమాలో గ‌మ‌నించాను. 
 
- సాధార‌ణంగా మ‌న సినిమాల్లో పోలీసుల‌ను హీరోలుగా చూసుంటాం. అయితే ట్రాఫిక్ పోలీసుల గురించి పెద్ద‌గా ఆలోచించం. కానీ జీవితంలో ఏదో సాధించాల‌నుకునే ఓ ట్రాఫిక్ ఎస్సై క‌థే ఈ ‘క‌ప‌ట‌ధారి’. ట్రైల‌ర్ చూసుంటే మీకు క‌థేంటో కాస్త అర్థ‌మై ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఎప్పుడో న‌ల‌బై ఏళ్ల క్రితం మూసేసి ప‌క్క‌న ప‌డేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికిన‌ప్పుడు దీంట్లో ఎక్క‌డో తేడా జ‌రిగిందే అనే సందేహం హీరోకి వ‌స్తుంది. అతని పొజిషన్‌లో పెద్ద వాళ్లైన ఆఫీస‌ర్స్ వ‌ద్ద‌ని చెప్పినా కూడా విన‌కుండా కేసుని సాల్వ్ చేయ‌డానికి హీరో ప్ర‌య‌త్నించ‌డ‌మే సినిమా ప్ర‌ధాన క‌థాంశం. అయితే స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఎక్క‌డా సినిమా ఎక్కువ‌గా డివీయేట్ కాదు. సాంగ్స్‌, కామెడీ, యాక్ష‌న్ అన్నీ ఓ ప‌రిమిత అవ‌ధుల్లో ఉంటాయి. సినిమా ఫోక‌స్డ్‌గా ఉంటుంది. 
 
- ‘క‌ప‌ట‌ధారి’ సినిమా న్యూ జోనర్ థిల్ల‌ర్ మూవీ. సినిమా కాస్త డార్క్ స్పేస్‌లో తెర‌కెక్కింది. క‌న్న‌డ వెర్ష‌న్‌లో సినిమా కాస్త స్లో స్పేస్‌లో ఉన్న‌ట్లు అనిపిస్తుంది. కానీ తెలుగులో స్పీడ్‌గా ఉంటుంది. ల్యాగ్స్ త‌గ్గించి షార్ప్ చేశాం. 
 
- నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ‘క‌ప‌ట‌ధారి’ సినిమా పూర్తి భిన్న‌మైన చిత్రం. ఇదొక క్రైమ్ డ్రామా. ట్విస్టులు, స‌స్పెన్సులు అన్నీ ఉంటాయి. 
 
-కన్న‌డ చిత్ర‌సీమ ఒక‌ప్పుడున్న స్టేజ్‌లో ఇప్పుడు లేదు.  నెక్ట్స్ రేంజ్‌లో ఉంది. ఆ వేవ్‌లో ‘కావ‌లుధారి’ చేరింద‌ని నేను భావిస్తున్నాను.  క‌న్న‌డ‌లో ‘కావ‌లుధారి’ సినిమా చేసిన రైట‌ర్‌, డైరెక్ట‌ర్ హేమంత్ రావుగారు తెలుగులో రీమేక్ చేస్తున్న‌ప్పుడు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. టెక్నికల్‌గా ‘కపటధారి’లో చిన్న చిన్న మార్పులు చేశాం. 
 
- నేను క‌మ‌ర్షియ‌ల్ పోలీస్ మూవీస్‌ను బాగా ఎంజాయ ఛేస్తాను. అయితే ఇది రెగ్యులర్ పోలీస్ కమర్షియల్ మూవీ కాదు. కాబ‌ట్టి నా పాత్ర‌ను హీరోయిక్‌గా చూపించాల్సిన అవ‌స‌రం లేదు. చాలా నేచుర‌ల్‌గా చేసుకుంటూ వెళ్లాం. యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం కాబట్టి నెటివిటీ స‌మ‌స్య ఈ సినిమాలో క‌న‌ప‌డ‌దు. 
 
- ‘క‌ప‌టధారి’ షూటింగ్ గతేడాది ఫిబ్ర‌వ‌రికే పూర్త‌య్యింది. మార్చిలో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ అయ్యింది. దీంతో సినిమా విడుద‌లను దాదాపు ఏడాదిపాటు వాయిదా వేయాల్సి వ‌చ్చింది. 
 
- నందితా శ్వేత వండ‌ర్‌పుల్ ఆర్టిస్ట్‌. ఆమె న‌టించిన ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ సినిమా చూశాను. ‘కపటధారి’ సినిమాలో నాకు స‌పోర్టింగ్ రోల్‌లో క‌నిపించింది నందిత‌. మా మ‌ధ్య డ్యూయెట్స్ ఏమీ ఉండ‌వు. ‘కావలుధారి’ సినిమా త‌న‌కు న‌చ్చింది. పాత్ర న‌చ్చ‌డంతో చిన్న పాత్ర‌గా అనిపించినా చేయ‌డానికి సిద్ధ‌మైంది నందితా శ్వేత‌. 
 
- ప్ర‌స్తుతం ‘అన‌గ‌న‌గా ఒక రౌడీ’ సినిమా చేస్తున్నాను. దాని త‌ర్వాత ఓ ప్రోగ్రెసివ్ రొమాంటిక్ డ్రామా  చేస్తున్నాను.