మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (11:28 IST)

టిక్కెట్ల‌పై త్రివిక్ర‌మ్ అన్న‌మాట‌లు ఆయ‌న‌వికావు

Trivikram twiter
ఆంధ‌ప్ర‌దేశ్‌లో ఆన్‌లైన్ టికెట్ల‌పై ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అన్న‌మాటుల‌వైర‌ల్‌గా మారాయి. చిన్న పెద్ద సినిమాల‌కు అంతా ఒకేలా టికెట్ రేట్లు వున్న‌ప్పుడు స్కూల్‌, ఆసుప‌త్రిల‌లో ఎందుకు ఒకే రేటు వుండ‌కూడ‌దు? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్లు ట్విట్ట‌ర్‌లో వ‌చ్చింది. దానికి మంత్రి పేర్నినాని కూడా నిన్న స‌చివాల‌యంలో స‌మాధానం ఇస్తూ ఈ విష‌యాన్ని  వై.ఎస్‌. జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ‌తాన‌ని అన్నారు.
 
కానీ శ‌నివారంనాడు ఉద‌య‌మే ఆయ‌న తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే హారిక హాసిని నిర్మాణ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త్రివిక్ర‌మ్ నుంచి ఏదైనా అధికార ప్ర‌క‌ట‌న మాత్ర‌మే వ‌స్తాయి. అతనికి సోషల్ మీడియా లో చెప్ప‌లేదు. అతని ఫోటో/పేరుతో కూడిన వివిధ ప్రొఫైల్‌లు చేసిన వ్యాఖ్యలను దయచేసి నమ్మవద్దు. అని ప్ర‌క‌టించారు.
 
మ‌రి ఇప్ప‌టికే టికెట్ల రేట్ల‌పై ఆన్‌లైన్ సిస్ట‌మ్ వుండాల‌ని మెగాస్టార్‌తోపాటు ప‌లువురు సినీ ప్రముఖులు ఎప్పుడో ఆంధ‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెప్పారు. మ‌ధ్య‌లో చిన్న చిన్న చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఫైనల్‌గా సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాల టికెట్ల రేట్ల‌కు గండిప‌డింది.