శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (15:21 IST)

రేప్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు

అత్యాచారం కేసులో బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ ఒబెరాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళను పెళ్లి పేరుతో బలవంతంగా అత్యాచారం చేసి.. ఆ తతంగాన్ని వీడియో తీసి డబ్బులు ఇవ్వకుంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించినట్టు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. బుల్లితెర నటుడుపై సెక్షన్ 376, 384 కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కరణ్ పలు టీవీ సీరియళ్ళలో పాటు పలు రియాలిటీ షోల్లో సైతం కనిపించాడు.
 
కాగా, గతంలో కూడా మలయాళం సినీ ఇండస్ట్రీలో కూడా నటి భావనను వేధించిన కేసులో మాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నటి భావన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ప్రస్తుతం దిలీప్ బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే.