శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (12:55 IST)

రజనీ ఫ్యాన్స్‌కు పండగే.. 2018లో రిలీజ్ కానున్న రోబో, కాలా...

కబాలితో కలెక్షన్ల వర్షం కురిపించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం కాలా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది రజనీకాంత్ నటించిన మరో సినిమా రోబో

కబాలితో కలెక్షన్ల వర్షం కురిపించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం కాలా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది రజనీకాంత్ నటించిన మరో సినిమా రోబో 2.0 చిత్రంతో పాటు కాలా కూడా రిలీజ్ కానుంది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించే ''రోబో 2.0'' చిత్రం జ‌న‌వ‌రిలో విడుద‌ల‌కాబోతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రజనీ కాంత్ మరో సినిమా కాలా కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. 
 
ముంబైలో అణ‌చివేత‌కు గురైన త‌మిళుల జీవ‌నం నేప‌థ్యంలో ''కాలా'' సినిమాను పా రంజిత్ తెర‌కెక్కించారు. త‌మిళ - హిందీ భాష‌ల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రంలో నానా పటేక‌ర్‌, హ్యూమా ఖురేషీ, అంజ‌లి పాటిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు.