తొడగొట్టిన నటుడు జీవీ.. రంగా అంటే ఏమిటో చూపిస్తాడట...

మంగళవారం, 26 డిశెంబరు 2017 (12:10 IST)

gv sudhakar naidu

సినీ నటుడు జీవీ అలియాస్ జీవీ సుధాకర్ నాయుడు తొడగొట్టాడు. వంగవీటి రంగా అంటే ఏమిటో చూపిస్తానంటూ శపథం చేశాడు. సినీ నటుడిగా ఉన్న జీవీ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశాడో తెలుసుకుందాం. విజయవాడ రాజకీయాలను శాసించిన నేత వంగవీటి రంగా. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను ఆయన నిర్మించనున్నారు. ఇందులో వంగవీటి రంగా పాత్రను జీవి పోషించనున్నారు.
 
ఈనేపథ్యంలో మంగళవారం వంగవీటి రంగా 29వ వర్థంతిని పురస్కరించుకుని విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవి సుధాకర్ నాయుడు తొడగొట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 150 ఎపిసోడ్లతో రంగా జీవిత చరిత్ర ఆధారంగా టీవీ సీరియల్ తీస్తున్నానని చెప్పారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి చిత్రంలాకాకుండా, రంగా ఘనత చాటేలా, వాస్తవాలు ఉంటాయన్నారు. 
 
రంగా జీవిత చరిత్రను సినిమా తీయాలన్నది దాసరి కోరికని, ఆ కోరిక మేరకే ఈ సిరీస్‌ తీయనున్నట్టు తెలిపారు. రంగాపై సినిమా తీద్దామనుకుంటే 6 గంటల కథ వచ్చిందన్నారు. 'బాహుబలి'ని మించిన కథ రంగా జీవిత చరిత్ర అని కొనియాడారు. కుల రాజకీయాలు వద్దని చెప్పిన వ్యక్తి రంగా అని జీవీ గుర్తు చేశారు. కాగా, రంగా విగ్రహానికి పూలమాల వేసిన జీవీ నాయుడు ఆపై తొడగొట్టారు. దీంతో రంగా అభిమానులు కేరింతలు పెట్టారు.దీనిపై మరింత చదవండి :  
Vijayawada Web Series Gv Sudhakar Naidu Vangaveeti Ranga Biopic

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి స్నేహితుడు ఓబయ్య ఎవరు? "సైరా" తొలి షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ...

news

బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డికి తర్వాత మేమే.. చిరుతో సమస్యలొచ్చాయ్: అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవితో తన సంబంధం గురించి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ...

news

సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి: #JaiSimhaTrailer

యువరత్న బాలకృష్ణ నటిస్తున్న 102 చిత్రం "జైసింహా". తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ ...

news

దుమ్ము దులుపుతున్న "మిడిల్ క్లాస్ అబ్బాయి"

2017 సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది ఆఖర్లో విడుదలై మంచి విజయాన్ని నమోదు ...