సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kumar
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:39 IST)

తమిళ అర్జున్ రెడ్డి టీజర్ ఎలా ఉందంటే...

అర్జున్ రెడ్డి సినిమాను "వర్మ" పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తుండగా బాల దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

అర్జున్ రెడ్డి సినిమాను "వర్మ" పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తుండగా బాల దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.
 
టీజర్‌ను చూసిన తెలుగు ప్రేక్షకులేకాకుండా తమిళ ప్రేక్షకులు కూడా దానిపై పెదవి విరుస్తున్నారు. దర్శకుడు బాల తమిళ నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించినట్లు కనిపించినప్పటికీ విజయ్ దేవరకొండ డైనమిజాన్ని తమిళ హీరో ఏ మాత్రం అందుకోలేకపోయాడని వాపోతున్నారు. ఇందులో హీరో ధృవ్ అమాయకంగా కనిపిస్తున్నాడంటున్నారు.
 
దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటనలో సగ భాగం చేసినా బాగుండేదని దయచేసి దాన్ని చెడగొట్టద్దని వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తమిళనాడులో కూడా బాగా ప్రదర్శించబడింది, మరి ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో వేచి చూడాలి.