వరుణ్ తేజ్ అంతరిక్ష్యం టీజర్ అదిరింది..!
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్. ఈ చిత్రాన్ని ఘాజీ ఫేమ్ సంకల్పరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఘాజీ సినిమాతో సరికొత్త చిత్రాన్ని అందించిన సంకల్పరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు అంతరిక్షం టీజర్ రిలీజ్ చేసారు.
హై టెక్నికల్ వాల్యూస్, హాలీవుడ్ టెక్నీషియన్స్ సారధ్యంలో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్ కెరియర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో పూర్తిస్థాయి అంతరిక్షం నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
ఇలా టీజర్ రిలీజ్ చేసారో లేదో..యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమా గర్వించదగ్గ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.