శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (11:55 IST)

ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి... 4 రోజులు అంతా అక్కడే!

Varun Tej, Lavanya
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ లగ్జరీ రిసార్ట్ నిజానికి ఒక చారిత్రాత్మక గ్రామం. దీనిని రిసార్ట్‌గా మార్చారు. 
 
ఒక పియాజ్జా, ఒక ప్రార్థనా మందిరం, ఒకప్పుడు పాఠశాల, బేకరీ, ఆలివ్ ప్రెస్‌లకు వంకరగా ఉండే దారులు, మీరు మా గ్రామ చరిత్రను అనుభూతి చెందగలరు” అని రిసార్ట్ తన వెబ్‌సైట్‌లో రాసింది. విలేజ్ రిసార్ట్‌లోని విలాసవంతమైన విల్లాల్లో అతిథులను ఉంచుతారు.
 
 వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1 న వివాహం చేసుకోనున్నారు. నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయి. అతిథులందరూ నాలుగు రోజుల పాటు ఆ రెస్టారెంట్లోనే ఉంటారు. 
 
అక్టోబర్ 30న, వరుణ్- లావణ్యల కుటుంబం, బంధువులు మొత్తం ఇటలీకి బయలుదేరుతారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ అంతా హాజరుకానున్నారు.