'నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు' : వరుణ్ తేజ్

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:42 IST)

టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను అన్నా అని పిలిచినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అన్నంత పని కూడా చేసింది. ఆ తర్వాత ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
varun tej
 
ఈ విమర్శలకు ధీటుగా వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వరుణ్ తేజ్ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 'నీ గురించి విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు' అంటూ దిమ్మదిరిగే పోస్టు పెట్టాడు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎఫ్ 2 సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

'ప‌టాస్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. ...

news

చ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ టైటిల్ ఇదే..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ "రంగ‌స్థ‌లం" సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. రూ.100 ...

news

'భ‌ర‌త్ అనే నేను' క‌థ కొర‌టాల రాసింది కాదా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన ...

news

సుక్కు నెక్ట్స్ మూవీకి హీరో ఫిక్స్... ఈ సారి 'లెక్క' తప్పదట

సుకుమార్... అటు ప్రేక్ష‌కాభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోను ఇప్పుడు మారు మోగుతోన్న పేరు ...