"వీరసింహా రెడ్డి" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం
నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించారు. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ మూవీకి గోపిచంద్ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల ఆరో తేదీన ఈ మూవీ ప్రిరీలీజ్ ఈవెంట్‌ను ఒంగోలులోని ఏబీఎం కాలేజీ మైదానంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే, విలన్‌గా దునియా విజయ్ కనిపించనున్నారు.
రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అందించగా, శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇవి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం గట్టిగా నమ్ముతోంది. ఇకపోతే, ఎస్.థమన్ సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది.