సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (17:17 IST)

సైంధవ్ డబ్బింగ్ ప్రారంభించిన యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ

Shailesh Kolanu,  Nawazuddin Siddiqui
Shailesh Kolanu, Nawazuddin Siddiqui
వెంకటేష్ 75వ మూవీ ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. వెరీ ట్యాలెంటెడ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ 'రాంగ్ యూసేజ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
 
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘సైంధవ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు  నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా తన పాత్రకు సంబధించిన డబ్బింగ్ ని ప్రారభించారు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి స్పెషల్ వీడియోని విడుదల చేశారు. నవాజుద్దీన్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెబుతున్న ఈ వీడియో ఎంతగానో అలరించింది.      
 
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్  సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
 
ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
‘సైంధవ్’ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.
 
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్