బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 12 మార్చి 2018 (13:07 IST)

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి కన్నుమూత

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి ఈ రోజు వైజాగ్‌లో కన్నుమూశారు. దాదాపు 180కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన వంకాయల క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, 3 హిందీ చిత్రాలలో కూడా నటించారు. సూపర్ హిట్స్

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి ఈ రోజు వైజాగ్‌లో కన్నుమూశారు. దాదాపు 180కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన వంకాయల క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, 3 హిందీ చిత్రాలలో కూడా నటించారు. 
 
సూపర్ హిట్స్‌గా నిలిచిన సీతామహాలక్ష్మి, సూత్రధారులు, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, శృతిలయలు, విజేత తదితర చిత్రాల్లో నటించారు. "వంకాయల జ్యూయలర్స్" పేరుతో వైజాగ్‌లో ఆయన ఓ నగల షాప్‌ను కూడా నడుపుతున్నారు.