Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అభిమానుల దీవెన‌లే దాస‌రి గారిని ర‌క్షించాయి: మ‌ంత్రి త‌ల‌సాని

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:54 IST)

Widgets Magazine
dasari - talasani

ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్రముఖులు దాసరిని ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం దాసరిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాసయాద‌వ్ ప‌రామ‌ర్శించారు. 
 
అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... దాస‌రి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌కు తండ్రి లాంటి వారు. ప‌రిశ్రమ‌లో ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ముందుండి ప‌రిష్కరిస్తారు. అంత గొప్ప వ్యక్తి అనారోగ్యానికి గురి కావ‌డం క‌లచి వేసింది. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం మొరుగు ప‌డుతోంది. 
 
త్వర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వారి దీవెన‌లే ఆయ‌న్ను ర‌క్షించాయి. రెండు, మూడు రోజుల్లో ఆయ‌న పూర్తిగా కోలుకుంటారు. ఆయ‌న ఆరోగ్యంపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ల‌ను సంప్రదించి వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు అని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రెండేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఎంతో మంది చాంబర్స్ ఏర్పాటు చేయాలని, ...

news

పెద్ద నోట్ల రద్దు కథాంశంతో "ఏటీఎం"

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ ...

news

శ్రీముఖిని బుద్ధున్నోడు ఎవడైనా లవ్ చేస్తాడా? నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా?

లాస్య-శ్రీముఖి- రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ముగ్గురే ప్రస్తుతం ...

news

''కాటమరాయుడు'' టీజర్ చూసిన అన్నయ్య.. పవన్‌ను ఇంటికి పిలిపించి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవిల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. ...

Widgets Magazine