సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (10:46 IST)

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. ఆ బిల్డింగ్ పూర్తయ్యాకే మ్యారేజ్.. విశాల్

Vishal new look
నటుడు విశాల్ తన పెళ్లికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి తనకు సెట్ కాదని విశాల్ చెప్పేశాడు. త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తానని తెలిపాడు. 
 
అయితే తన పెళ్ళికి మూడేళ్లు సమయం పడుతుందని విశాల్ వెల్లడించాడు. యాక్టర్స్ యూనియన్ కోసం కడుతున్న బిల్డిండ్ పూర్తయ్యాకే మ్యారేజ్ అంటున్నాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్.
 
ఇక విశాల్ ప్రియురాలు ఎవరన్నదానిపై చర్చ నడుస్తోంది. హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు రావడంతో ఆమెతో విశాల్ పెళ్లి అంటున్నారు. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో విశాల్‌కు భార్యగా అభినయ నటించింది. గతంలో కూడా ఈ హీరో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి.