ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (15:23 IST)

సాహో షూటింగ్ ఎంతవ‌ర‌కు వ‌చ్చింది... అస‌లు ప్ర‌భాస్ ఎక్క‌డున్నాడు..?

బాహుబ‌లి, బాహుబ‌లి 2  సినిమాలు ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డంతో ప్ర‌భాస్ పేరు మారుమోగ్రింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. 
 
సాహో సినిమాని ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అయ్యింది అనేది క్లారిటీ లేదు. దీంతో అస‌లు షూటింగ్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది అనేది తెలియ‌క ఫ్యాన్స్ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు.ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సాహో ఆస్ట్రియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ...హాయ్ డార్లింగ్స్ ...ఆస్ట్రియా దేశంలోని టిరోల్ రీజియన్ లో జరుగుతోంది. ఇక్క‌డ‌  షూటింగ్ ఎక్స్ పీరియ‌న్స్ అద్భుతం అంటూ ఓ ఫోటోను షేర్ చేసారు. ప్రభాస్ షేర్ చేసిన ఈ ఫొటోలో శ్రద్ధాకపూర్‌తో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులు కూడా ఉన్నారు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ భారీ ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ తదితర బాలీవుడ్ దిగ్గజాలు నటిస్తున్నారు. స్వాతంత్ర‌ దినోత్స‌వ  కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సాహో ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.