గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:06 IST)

2వేల థియేటర్లలో ప్రీమియర్ షోస్.. భరత్ అనే నేను ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ మాత్రమే?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ''భరత్ అనే నేను'' సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌‌లో మహేష్‌కు మంచి మార్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ''భరత్ అనే నేను'' సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌‌లో మహేష్‌కు మంచి మార్కెట్‌ ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఫ్లాప్‌ సినిమాలు కూడా అక్కడ మిలియన్‌ డాలర్ల వసూళ్లు కురిపిస్తాయి.

ఈ కారణంతోనే ''భరత్ అనే నేను'' సినిమాల్లో విదేశాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 19న దాదాపు 2000 ప్రీమియర్‌ షోస్‌ వేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. 
 
గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్‌ షోస్‌‌ను ప్రదర్శించలేదు. దీంతో పాటు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే భరత్ అనే నేను మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు ప్రిన్స్ ఫ్యాన్స్‌ మధ్య భారీ అంచనాలను పెంచేశాయి. శనివారం (ఏప్రిల్-7)న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 
 
ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. శనివారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్- ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ వేడుకకు ఎన్టీఆర్, చరణ్‌లను ముఖ్య అతిథులుగా మహేశ్‌బాబు ఆహ్వానించినట్టు సమాచారం. కానీ ఈ వేడుకకు ఎన్టీఆర్ మాత్రమే హాజరవుతున్నారని తెలిసింది. అనివార్య కారణాల వల్ల చెర్రీ రాలేకపోతున్నాడని టాక్.