శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

హీరో అఖిల్ అక్కినేని సరసన జాన్వీ కపూర్!!

jhanvi kapoor
జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని అందాల నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో సినిమా అవకాశం లభించింది. అఖిల్ అక్కినేని చిత్రంలో నటించేందుకు ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో జాన్వీ కథానాయికకాగా, ఈ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. ఈలోగా... ఆమెకు మరో అవకాశం వచ్చిందని టాక్. అఖిల్ తాజా చిత్రంలో జాన్వీని కథానాయిక ఎంచుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి అనిల్ దర్శకుడు. 
 
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ధీర' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. ఆ తరం హీరోయిన్లలో నంబర్ వన్ అనిపించుకొన్న శ్రీదేవి... అటు ఏఎన్నార్‌తోనూ, ఇటు నాగార్జునతోనూ నటించారు. 
 
ఆమె వారసురాలిగా అడుగు పెట్టిన జాన్వీ ఇప్పుడు ఈతరం అక్కినేని హీరోతో కలసి నటిస్తుండడం విశేషం. సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం.