దివంగత విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) హీరోగా, శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్టర్ కింగ్. హన్విక క్రియేషన్ బ్యానర్ బి.ఎన్.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలుగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అలాగే టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న మిస్టర్ కింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
శరణ్ కుమార్ మాట్లాడుతూ.. మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. నిర్మాత బిఎన్ రావు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. శశి అద్భుతంగా డైరెక్ట్ చేశారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. సునీల్, తనికెళ్ళ భరిణి, మురళి శర్మ, వెన్నల కిషోర్ లాంటి సినియర్లతో పని చేయడం గొప్ప అనుభవం. వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నా మొదటి సినిమా. మీ అందరి సపోర్ట్, ప్రేమ కావాలి. అందరూ 24న సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవం వున్న ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది. ఆడ పిల్ల వున్న ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. గత రెండు రోజులుగా సినిమా ప్రోజక్షన్ చేసినపుడు వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సెన్సార్ ప్రోజక్షన్ జరిగినపుడు.. క్లైమాక్స్ చూసి వాళ్ళ పాప గుర్తు వచ్చిందని వారు చెప్పడం భావోద్వేగాన్ని కలిగించిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. థియేటర్‌కి వచ్చిన వారు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
యశ్విక నిష్కల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మీ అందరి ప్రోత్సాహం కావాలి అన్నారు. ఊర్వీ సింగ్ మాట్లాడుతూ.. మంచి టీం తో కలసి పనిచేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మీ అందరికీనచ్చుతుందని ఆశిస్తున్నాను. బిన్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.
డీవోపి తన్వీర్ మాట్లాడుతూ.. అందరూ తప్పకుండా థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి అని కోరారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. శశిగారు కథ చెప్పినపుడు అద్భుతంగా అనిపించింది. కొత్త కాన్సెప్ట్. ఈ సినిమాలో నన్ను ఫాదర్‌గా నటించమని శశిగారు కోరారు. ఆయన గైడెన్స్‌లో నేను శరన్ ఫాదర్ అండ్ సన్‌గా నటించాం. బిఎన్ రావు చాలా సపోర్ట్ చేశారు. టెక్నికల్‌గా చాలా మంచి టీం వుంది. ఈ సినిమా మంచి విజయంసాదిస్తుందని నమ్ముతున్నాను. మీ అందరి ప్రోత్సాహం కావాలి అని కోరారు
తారాగణం : శరణ్ కుమార్, యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్, ఆశిమ నర్వాల్, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, సునీల్, వెన్నెల కిషోర్, ఎస్ఎస్ కాంచి, శ్వేతా, ఐడ్రీం అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్ కుమార్, శ్రీనిధి గూడూరు తదితరులు
టెక్నికల్ టీం :
రచన, ఎడిటింగ్, దర్శకత్వం: శశిధర్ చావలి
నిర్మాత: బిఎన్ రావు
సహా నిర్మాత: రవి కిరణ్ చావలి
బ్యానర్ : హన్విక క్రియేషన్స్
మ్యూజిక్: మణిశర్మ
డీవోపీ: తన్వీర్
పీఆర్వో : వంశీ- శేఖర్