బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (19:14 IST)

యూత్‌ను ఆకట్టుకునే నితిన్-కీర్తి సురేష్ 'రంగ్‌దే'

Rang de still
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు. సాంకేతిక‌తః  సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, నిర్మాత‌: సూర్యదేవర నాగ వంశీ, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
 
నితిన్, కీర్తి సురేశ్ న‌టించిన రంగ్‌దేపై పెద్ద అంచ‌నాలే వున్నాయి. ట్రైల‌ర్‌లోనే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో వుంటుంద‌ని తెలిసిపోయింది. నితిన్‌కు చెక్‌దే చెక్ పెట్ట‌డంతో ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నాడు. పైగా దర్శకుడు వెంకీ అట్లూరి కూడా సినిమాపై మ‌రింత న‌మ్మ‌కంగా క‌నిపించాడు. మ‌రి ఈ సినిమాలో ఏముందో చూద్దాం.
 
కథ:
అర్జున్ (నితిన్), అను (కీర్తీ సురేష్) ఇరుగు పొరుగు కుటుంబాల వారు. అను అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అర్జున్‌పై కంప్ల‌యిట్లు ఇస్తుండేది. అను చ‌దువులో ఫ‌స్ట్‌. అందుకు రివ‌ర్స్ అర్జున్‌. కాలేజీస్థాయిలో ఇరువురు ఒక‌రికొక‌రు ఏడిపంచుకుంటూ ఆనందిస్తుంటారు. అందులో పైశాచిక ఆనందం అర్జున్ అనుభ‌విస్తాడు. అలాంటి అర్జున్ కు ఓ గోల్ కూడా వుంటుంది. అది నెర‌వేరే టైంకు చిత్ర‌మైన ప‌రిస్థితుల్లో అర్జున్‌, అనును వివాహం చేసుకోవాల్సి వ‌స్తుంది. ఇక త‌ర్వాత వారి వైవాహిక జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి?  అనేది తెర‌పై చూడాల్సిందే. 
 
విశ్లేష‌ణః
ఇది పూర్తిగా వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. హీరో హీరోయిన్లు ఒక‌రికొక‌రు తెలీని అమాయ‌క‌త్వంలో ఆట‌ప‌ట్టించుకోవ‌డం, అది చివ‌రికి పెద్ద‌ల మ‌ధ్య చిన్న‌చిన్న చిక్కులు తెచ్చిపెట్ట‌డం వంటివి యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇలాంటి క‌థ‌లు గ‌తంలో చాలానే వ‌చ్చాయి. అయినా నితిన్‌, కీర్తిల ఆట‌ప‌ట్టింపులు, అల‌క‌లు కొత్త‌గా అనిపిస్తాయి. పాత్ర‌లో ఇద్ద‌రూ మ‌మేకం అయ్యారు. నితిన్ అమాక‌త్వంతో కూడిన పాత్ర‌కు సూట‌య్యాడు. కీర్తి పాత్ర మ‌రింత బాగుంది. ఇద్ద‌రి న‌ట‌న బాగుంది. నితిన్ స్నేహితులు ఓకే. ఇక‌ వెన్నెల కిషోర్ పాత్ర తీరు చాలా అల‌రిస్తుంది. సెకండాఫ్‌లో ఆయ‌నే సినిమాకు బోన్‌గా నిలిచాడు. 
 
మొద‌టి భాగం చాలా స‌ర‌దాగా సాగిపోతుంది. రెండో భాగంలో అంతే వినోదంతోపాటు సెంటిమెంట్‌, ఎమోష‌న్స్ బాగా పండాయి. ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యేలా హీరో హీరోయిన్ల పాత్ర‌లున్నాయి. పెళ్లి అయ్యాక కూడా అల్ల‌రి చిల్ల‌రిగా వుండే హీరో త‌ను తండ్రి కాబోతున్నాడ‌ని తెలిసే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్విస్ట్ అత‌నిలో మార్పును క్రియేట్ చేస్తుంది. అదే సినిమాకు హైలైట్‌. కీర్తి రోల్ కూడా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి నుంచీ ఓ అల్లరి అమ్మాయిలా తన నుంచి కొత్త పెర్ఫామెన్స్ ను ఖచ్చితంగా ఇందులో చూస్తారు. కేవలం తన చేష్టలతో ఫన్ ను చెయ్యడమే కాకుండా గ్లామరస్ గా కూడా కనిపిస్తుంది. కొన్ని ముఖ్య సన్నివేశాల్లో ఎమోషన్స్ ను కూడా కీర్తి బాగా పండించింది.
 
సీనియర్ నటులు నరేష్, బ్రహ్మాజీ, కౌసల్య తదితరులు తమ పాత్రల పరిధి మేర ఎప్పటిలానే న్యాయం చేకూర్చారు. పాట‌లకు దేవి మ్యూజిక్ శ్ర‌ద్ధ క‌నబ‌రిచారు. కానీ బాగా అల‌రించే సాహిత్యం వెన్నంటే సంగీతం ఇవ్వ‌లేక‌పోయారు. మొత్తంగా చూస్తే కొత్త‌గా ఏమీలేదు అనిపించినా స‌ర‌దాగా అనిపించే వుంటుంది. పాత సినిమాల‌ను పోలిక‌లేకుండా చూస్తే ఈ సినిమా టైంపాస్ సినిమాగా నిలుస్తుంది.  
 
 పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ మంచి రిచ్ గా ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా మొదటి ఫ్రేమ్ నుంచి ఉన్నతంగా ఉన్నాయి.  ద‌ర్శ‌కుడు చ‌క్క‌టి స్క్రీన్ ప్లే ఇందులో కనిపించడం వల్ల మంచి ఎంటెర్టైన్మెంట్ కనిపిస్తుంది. మొద‌టి నుంచి చెబుతున్న‌ట్లు ఇంద్ర‌ధ‌న్సులో రంగులు ఎన్నివుంటాయో జీవితంలో అన్ని ఎమోష‌న్స్ రంగుల రూపంలో వుంటాయ‌ని చెప్పే టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. జీవితం కాబ‌ట్టి చిన్న‌పాటి అడ‌ల్ట్ సీన్స్ కూడా పెట్టి దానిని కూడా ఎంట్‌టైన్‌మెంట్‌గా మార్చేశారు.  వీకెండ్ సినిమాగా ఇది హాయిగా చూడొచ్చు.
 
రేటింగ్ః 3/5