బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 డిశెంబరు 2021 (13:05 IST)

వైఎస్ భారతి నాతో పాటు ఎందరికో స్ఫూర్తిదాయక మహిళ: పూనమ్ కౌర్

పూనమ్ కౌర్. ఈ పేరు చెబితే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియని వారు వుండరు. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా కూడా వుంటారు. అప్పుడప్పుడు నెటిజన్ల కామెంట్లకు రివర్స్ ఎటాక్ ఇస్తుంటారు.

 
ప్రస్తుతం ఆమె రిషికేష్ పర్వతాల్లో యోగిణులను కలుస్తూ ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు సందర్భంగా ఆమెపై చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అయ్యాయి.

 
ఆమె ఏమన్నదంటే.... వైఎస్ భారతిగారు నాతోపాటు ఎందరికో స్పూర్తిదాయకమైన శక్తివంతమైన మహిళ అన్నారు. దీనిపై నెటిజన్లు మళ్లీ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు.