నాకు వినపడుతోందయ్యా... యాత్ర ట్రెయిలర్ ఔట్... మమ్ముట్టి యాక్షన్ ఎలా వుందంటే?(Video)

Mammootty
Last Modified సోమవారం, 7 జనవరి 2019 (19:45 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఈ చిత్రంలో వైఎస్సార్‌గా మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ట్రెయిలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల ముందుకు వచ్చేసింది యాత్ర ట్రెయిలర్.

ఇందులో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. వైఎస్సార్ 68 రోజుల సుదీర్ఘ పాదయాత్ర ఇతివృత్తింగా తెరకెక్కుతున్న ఈ యాత్ర చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇందులో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్నారు. ఇంకా రావు రమేష్, సుహాసిని, ఆశ్రిత ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వీడియో చూడండి...దీనిపై మరింత చదవండి :