సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (21:12 IST)

మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు...

ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని భార్య ఇలా అంది.
భార్య: ఏమండీ షాంపూను తలకే రాసుకోవాలి. ఒంటికి కాదు.
భర్త: ఒసేయ్ తింగరిదానా... మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదైనా చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నావా. ఇది హెడ్ అండ్ షోల్డర్స్.
 
2.
ఏమిటి రాధా... మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావు అని అడిగింది సుజాత.
చూడు సుజాతక్కా.. పొద్దున్న ఈయనకి ఫోన్ చేస్తే, ఒక అమ్మాయి.. మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు అని చెప్పింది మరి..... అసలు విషయం చెప్పింది రాధ.