ఇక తెలంగాణ హీరోలదే రాజ్యమా? గీత గోవిందం - శ్రీనివాస కళ్యాణం ఏం చెప్తున్నాయి?

ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా రెండు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి గీత గోవిందం, మరొకటి శ్రీనివాస కళ్యాణం. గీత గోవిందం చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ అయితే శ్రీనివాస కళ్యాణంలో హీరో నితిన్. వీళ్లద్దరూ తెలంగాణ రాష్ట్రాన

Vijay Deverakonda-Nitin
ivr| Last Modified మంగళవారం, 24 జులై 2018 (12:45 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా రెండు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి గీత గోవిందం, మరొకటి శ్రీనివాస కళ్యాణం. గీత గోవిందం చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ అయితే శ్రీనివాస కళ్యాణంలో హీరో నితిన్. వీళ్లద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే.
 
ఇకపోతే ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండ అంటే యూత్‌లో బాగా క్రేజ్ ఏర్పడిపోయింది. ఇక నితిన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇదిలావుంటే తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న గీత గోవిందం చిత్రం తాలూకు అఫీషియల్ టీజర్ ఒక్కరోజులోనే 30 లక్షల వ్యూస్ సొంతం చేసుకుని ఔరా అనిపిస్తోంది. 
 
మరోవైపు నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణ్ టీజర్ ఒక్క రోజులో 20 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాల్లో నటించిన ఇద్దరు హీరోలు కూడా తెలంగాణకు చెందినవారే. ఇదివరకు తెలంగాణకు చెందినవారు నటులుగా రాణించడం లేదనీ, తొక్కేస్తున్నారనే కామెంట్లు వస్తుండేవి. మరి వీళ్లిద్దరి స్టార్ డమ్ చూశాక... ఆ కామెంట్లకు ఫుల్‌స్టాప్ పడిపోతుందేమో? దీనిపై మరింత చదవండి :