శ్రీకాంత్ ఆపరేషన్-2019 మూవీ టార్గెట్ ఎవ‌రు..?

సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలే కథాఅంశంగా తీసే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందిన కాంటెంపరరీ పొలిటికల్ ఫిల్మ్ "ఆపరేషన్-2019. Beware of Public అనే క్యాప్షన్‌తో ఒక ఏవేర్నెస్ క్రియేట్ చేస్తున్న ఈ సంచలన రాజకీయ నేపధ్య చిత్రంలో పబ్లిక్ స్

Srikanth
srinivas| Last Modified శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:39 IST)
సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలే కథాఅంశంగా తీసే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందిన కాంటెంపరరీ పొలిటికల్ ఫిల్మ్ "ఆపరేషన్-2019. Beware of Public అనే క్యాప్షన్‌తో ఒక ఏవేర్నెస్ క్రియేట్ చేస్తున్న ఈ సంచలన రాజకీయ నేపధ్య చిత్రంలో పబ్లిక్ స్టార్ శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు సెన్సేషనల్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవటం విశేషం. 
 
హీరోగా నటించటంతో పాటూ చిత్ర సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్న శ్రీకాంత్‌కు ఈ సినిమా మరో "ఆపరేషన్ దుర్యోధన"లాంటి బోల్డ్ పొలిటికల్ ఎటెంప్ట్ అవుతుంది అంటున్నారు చిత్ర దర్శకులు కరణం బాబ్జీ.
 
 శ్రీకాంత్ సరసన యజ్ఞా శెట్టి, దీక్షా పంత్ హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో ఇంకా సుమన్, కోట, పోసాని, శివకృష్ణ, నాగినీడు, హరితేజ వంటి దాదాపు 40 మందికి పైగా ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 
అలివేలు ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ పొలిటికల్ అడ్వెంచర్‌ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు చిత్ర దర్శకుడు కరణం బాబ్జి. 
ర్యాప్ రాక్ షకీల్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట ప్రసాద్, ఎడిటింగ్:ఉద్ధవ్, రచన- స్క్రీన్ ప్లే -  దర్శకత్వం: కరణం బాబ్జి. మ‌రి ఈ చిత్రంలో ఏ పొలిటిక‌ల్ లీడ‌ర్‌ని టార్గెట్ చేసారో తెలియాలంటే ఈ నెల 28 వ‌ర‌కు ఆగాల్సిందే.దీనిపై మరింత చదవండి :