గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By IVR
Last Modified: మంగళవారం, 1 జులై 2014 (21:54 IST)

జూలై 11న వరల్డ్‌వైడ్‌గా వెంకటేష్‌, మీనాల 'దృశ్యం'

మలయాళంలో సూపర్‌ డూపర్‌హిట్‌ అయిన 'దృశ్యం' చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా మూవీ మొఘల్‌ డా|| డి.రామానాయుడు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, రాజ్‌కుమార్‌ థియేటర్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై సీనియర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. కొంత గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. 
 
విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ - ''నా కెరీర్‌లో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో రాంబాబు అనే సింపుల్‌ రోల్‌ చేశాను. ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడు సంగతులు జరుగుతుంటాయి. నచ్చని విషయాలతో ఓ సాధారణ వ్యక్తి ఎలా పోరాడాడు అనేది చిత్ర కథ. శ్రీప్రియగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు. 
 
నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ - ''ఇప్పటివరకు ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, థ్రిల్లర్‌ సినిమాలు చూశాం. మా బ్యానర్‌లో కూడా చేశాం. ఆ రెండిటినీ మిళితం చేసి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు థ్రిల్‌ కూడా ఉంటుంది. ఈ సినిమా నిర్మించడం ఓ కొత్త అనుభూతిని కలిగించింది. జూలై 4న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు కూడా థ్రిల్‌ అవుతారు'' అన్నారు.
 
నిర్మాత రాజ్‌కుమార్‌ సేతుపతి మట్లాడుతూ - ''ఈ చిత్రంలో వెంకటేష్‌గారు తన క్యారెక్టర్‌ని అద్భుతంగా పోషించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతిని పొందుతారు'' అన్నారు. దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ - ''వెంకటేష్‌తో ఈ సినిమా చేయడం ఆనందం కలిగించింది. ఇందులోని ప్రతి క్యారెక్టర్‌ని అందరూ ఐడెంటిఫై చేసుకుంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం'' అన్నారు.
 
పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, సమీర్‌, రవి కాలే, సప్తగిరి నాయుడు, గోపి, రోషన్‌ బషీర్‌, ఉత్తేజ్‌, కాదంబరి కిరణ్‌, కాశీవిశ్వనాధ్‌, జోగినాయుడు, చిత్రం శ్రీను, చైతన్యకృష్ణ, బెనర్జీ, ప్రభు, ప్రసన్నకుమార్‌, ఆయుష్‌ అగర్వాల్‌, అన్నపూర్ణమ్మ, సంధ్యాఝనక్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి కథ: జీతు జోసెఫ్‌, రచయితలు: పరుచూరి బ్రదర్స్‌, మాటలు: డార్లింగ్‌ స్వామి, కెమెరా: ఎస్‌.గోపాల్‌రెడ్డి, ఆర్ట్‌: వివేక్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంగీతం: శరత్‌, సాహిత్యం: చంద్రబోస్‌, స్టంట్స్‌: సాల్మన్‌, జాక్లీ జాన్సన్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: వెంకటేశ్వరరావు, వి.వి.రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సురేష్‌ బాలాజీ, జార్జ్‌ పియస్‌, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: కె.రాజ్‌నారాయణ్‌, సి. ప్రేమనాధ్‌, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి, దర్శకత్వం: శ్రీప్రియ.