శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: శనివారం, 21 జులై 2018 (20:16 IST)

త్రిష 'మోహిని' చిత్రాన్ని చూసి నవ్వుకున్న సెన్సార్ సభ్యులు... ఎందుకు?

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలంగా టాప్ హీరోయిన్‌గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహినిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళం, తెలుగు భాష‌ల్లో మెహినిగా ఈ చిత్రం తెర‌క‌క్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీ ల‌

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలంగా టాప్ హీరోయిన్‌గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహినిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళం, తెలుగు భాష‌ల్లో మెహినిగా ఈ చిత్రం తెర‌క‌క్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఎస్‌. ల‌క్ష్మ‌ణ్ కుమార్. శ్రినివాస‌రావు ప‌ల్లెల, క‌ర‌ణం మ‌ధుల‌త,గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తి లు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మాణం చేప‌ట్టారు. ఆర్‌.మాదేష్ ద‌ర్శ‌కుడు. హ‌ర్ర‌ర్ కామెడి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది.
 
ఈ చిత్రంలో త్రిషతో పాటు జాఖీ, యోగి బాబు, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా వుంది. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ంర ఆడియోని విడుద‌ల చేశారు. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జులై 27న రెండు భాషల్లో విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ... త్రిషకి తెలుగులో ఇన్న క్రేజ్ అంద‌రికి తెలుసు. మెహిని చిత్రం త‌న‌కి కమ్ బ్యాక్‌గా వుంటుంది. హ‌ర్ర‌ర్ కామెడి యాక్ష‌న్ చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుదల చేసిన ట్రైల‌ర్‌కి మాంచి క్రేజ్ రావ‌టంతో ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా హ‌ర్ర‌ర్ బ్యూటితో అంద‌ర్ని అల‌రిస్తుంది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. త్రిష ఫెర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. 
 
క్లీన్ యు స‌ర్టిఫికెట్‌తో జులై 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం చూసిని సెన్సారు స‌భ్యులు న‌వ్వుతూ వ‌చ్చి నిర్మాత‌కి, ద‌ర్శ‌కుడుకి శుభాకాంక్ష‌లు చెప్పారు. అంతేకాదు ఈ చిత్రం చాలా బాగుంద‌ని, న‌వ్వించినంత సేపు న‌వ్వించి థ్రిల్ చేశార‌ని, ముఖ్యంగా కాన్సెప్ట్ చాలా కొత్త‌గా వుంద‌ని ప్ర‌శంశ‌లు జ‌ల్లు కురిపించారు. ముఖ్యంగా త్రిష న‌ట‌న ఆశ్చర్య‌ప‌రిచింద‌ని ఆమెకి ఇది సూప‌ర్ క‌మ్‌బ్యాక్ చిత్రంగా నిలుస్తుంద‌ని మ‌రీమ‌రీ చెప్పారు. ఈ టాక్‌తో ట్రేడ్లో క్రేజ్ వ‌చ్చింది. ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు.