Widgets Magazine

యాంకర్ శ్రీముఖి నటిగా అదరగొట్టేసింది... బీటెక్ బాబులు రివ్యూ రిపోర్ట్

'బీటెక్‌ బాబులు' నటీనటులు: నందు, శ్రీముఖి, శౌర్య, రోషిణి, తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌, అప్పారావు తదితరులు. ఈమధ్య కాలేజీ ప్రేమకథలు ఎక్కువయ్యాయి. 'హ్యాపీడేస్‌' వచ్చిన తర్వాత ఆ తరహా కథల్ని కొత్త దర్శకులు కథగా రాసుకుని ముందుకు వస్తున్నారు. ఆ కోవలోనిదే

B Tech Babulu
ivr| Last Modified శుక్రవారం, 8 డిశెంబరు 2017 (18:18 IST)
'బీటెక్‌ బాబులు' నటీనటులు: నందు, శ్రీముఖి, శౌర్య, రోషిణి, తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌, అప్పారావు తదితరులు.
 
ఈమధ్య కాలేజీ ప్రేమకథలు ఎక్కువయ్యాయి. 'హ్యాపీడేస్‌' వచ్చిన తర్వాత ఆ తరహా కథల్ని కొత్త దర్శకులు కథగా రాసుకుని ముందుకు వస్తున్నారు. ఆ కోవలోనిదే 'బీటెక్‌ బాబులు'. జేపీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పైన ధన జమ్ము నిర్మించారు. శ్రీను ఈమంది దర్శకత్వం వహించారు. యువతను టార్గెట్‌ చేస్తూ జబర్‌దస్త్‌ టీమ్‌తో కలిసి తీసిన ఈ చిత్రం శుక్రవారమే విడుదలైంది. అదెలావుందో చూద్దాం.
 
కథ : 
ఓ కాలేజీలో చదివే ఆరుగురు స్నేహితులుగా మారుతారు. అందులో విద్యార్థినిలు కూడా వుంటారు. అందులో శౌర్యకు సోదరుడు నందు. తను షార్ట్‌ ఫిలిం తీసి దానిద్వారా సినిమా చేయాలనే ప్లాన్‌లో వుంటాడు. నాయికగా శ్రీముఖి ఆడిషన్‌కు వస్తుంది. హీరోగా శౌర్య నటిస్తాడు. అయితే సీన్‌ను వివరించే క్రమంలో శ్రీముఖికి దగ్గరై ఆమెను ప్రేమించేస్తాడు. తర్వాత తను ఏదో ఉద్యోగం వచ్చి దూరమవుతుంది. కొన్నాళ్ళకు తిరిగి వచ్చి కలిసేసరికి నందు తన ప్రేమను వెల్లడిస్తాడు. అప్పటికే శ్రీముఖికి పెళ్లి నిశ్చయమవుతుంది. ఇది తెలిసిన నందు ఏం చేశాడు. కాలేజీ చదివే ఆరుగురు స్నేహితుల కథేమిటి? అనేది సినిమా.
 
విశ్లేషణ :
'పెళ్ళిచూపులు' తర్వాత నందు చక్కటి పాత్రలో కనిపించాడు. నిజమైన ప్రేమికుడిగా పోషించాడు. శ్రీముఖి కనిపించినంతసేపు బాగా పండించింది. సినిమాకు వారిద్దరు ప్రధాన బలం. కథ, కథనం దర్శకుడు ఎంత బాగా డిజైన్‌ చేసుకున్నోడో... నందు, శ్రీముఖి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అంత బాగా ప్లాన్‌ చేసుకున్నాడు. దర్శకుడు అవ్వాలనే తపనతో వున్న నందు అటు కెరీర్‌, ఇటు ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రలో మెప్పించాడు. వీరిద్దరూ చాలా సహజంగా నటించారు. ఇక మిగిలిన కాలేజీ స్నేహితులంతా ఒక్కోరిది ఒక్కో కథ. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవ్వాలనీ ఒకరు, కెరీర్‌లో పైకి వెళ్ళాలని మరొకరు, చదువును అశ్రద్ధ చేస్తూ ప్రేమవైపు పరిగెత్తే వ్యక్తి మరొకరు, టీచర్‌కే లైనేసే వ్యక్తిగా షకలక శంకర్‌ పాత్రలు వుంటాయి. ఈ కథంతా షకలక శంకర్‌ నెరేషన్‌తో సాగుతుంది. ఆఖరికి టీచర్‌ కుమార్తెనే తను పెండ్లి చేసుకోవడమనేది శంకర్‌కిచ్చిన ట్విస్ట్‌. ఈమధ్యలో పాత్రలన్నీ సరదాగా కాలేజీలో సాగుతుంటాయి. ఇందులో ఆలీ స్పూఫ్‌ అలరిస్తుంది.
 
దర్శకుడిగా శ్రీను కొత్త కుర్రాడైనా తనకున్న ప్రతిభతో చేశాడు. ఇంజనీరింగ్‌ చదువుకుంటోన్న నలుగురు విద్యార్థుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యులర్‌గా వాళ్ల లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్పదా? తల్లిదండ్రుల ప్రేమ గొప్పదా? అనే అంశాలకు హాస్యం.. సెంటిమెంట్‌ సన్నివేశాలు జోడించి అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా తెరకెక్కించారు. స్నేహితుల మధ్య వచ్చే సెంటిమెంట్‌ సన్నివేశాలు హ్యాపీడేస్‌ను గుర్తు చేస్తాయి. 
 
ఇక తాగుబోతు రమేష్‌ పాత్ర తాగుబోతు దొంగగా పూర్తిస్థాయిలో కనిపించాడు. వైజాగ్‌ శంకర్‌, వైవా హర్ష, సూర్య, జబర్‌‌దస్త్‌ రాఘవ, పటాస్‌ ప్రకాశ్‌, నోవల్‌ కిషోర్‌, రాణి, ఖుష్బు, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు. యువతను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చదగిందే అయినా ఇంకాస్త పరిణితి చెంది తీస్తే మరింతగా ఆకట్టుకునేది. ఆర్టిస్టుల పెర్‌‌ఫార్మెన్స్‌ సహజంగా వున్నా వారిలో హావభావాలు ఇంకా పలికించాల్సింది. ఏదిఏమైనా కొత్తవారితో దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
 
రేటింగ్ ‌: 2.5/5


దీనిపై మరింత చదవండి :