శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (19:54 IST)

'భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్

భమ్‌ బోలోనాథ్‌ నటీనటులు: నవదీప్‌, నవీన్‌ చంద్ర, పూజ, జాహ్నవి, ప్రవీణ్‌, తాగుబోతు రమేష్‌, పోసాని తదితరులు; నిర్మాత: శిరువూరి రాజేష్‌ వర్మ, సంగీతం: సాయికార్తీక్‌, దర్శకత్వం: కార్తీక్‌ వర్మ.
 
విడుదల: 27.2.2015 శుక్రవారం.
 
ఈమధ్య తెలుగు సినిమాలు లోబడ్జెట్‌తో యూత్‌ హీరోలతో చేసేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి... ఓ చిన్నపాటి కథను తయారుచేసుకుని చేయడం మామూలైంది. స్వామిరారా చిత్రం స్ఫూర్తిగా తీసుకుని ఈ దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నమే భమ్‌ బోలేనాథ్‌. ఇది మూడు జంటల కథ. దాన్ని చివరిగా ఒక పాయింట్‌తో ఎలా కలిపాడనేది సినిమా. మరి దాన్ని ఎలా చూపించాడో చూద్దాం.

 
కథగా చెప్పాలంటే...
కృష్ణ (నవీన్‌చంద్ర) ఓ దొంగ. తను చేసిన సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్(పోసాని)కి ఇస్తుంటాడు. చివరికి ఓ పెద్ద దొంగతనం చేసి దుబాయ్‌ వెళ్ళాలని ప్లాన్‌ చేసి కోటి రూపాలయల విలువ చేసే రింగ్‌ను కొట్టేసి 30 లక్షలు తీసుకుని పారిపోతాడు. విష్ణు(నవదీప్‌) చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక అటు దొంగతనాలు చేయలేక సతమతమవుతుంటాడు. ఆఖరికి వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకుంటాడు. కానీ అది ఎవరో కొట్టేస్తారు. మరోవైపు.. ప్రదీప్‌, కిరిటీలు తన గాళ్‌ ఫ్రెండ్స్‌తో సహజీవనం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటుపడతారు. వీరంతా ఓ సందర్భంలో ఒకరికి తెలియకుండా ఒకరు కలుస్తారు. ఈ మూడు కథలకు పాయింట్‌ ఓ కారు. ఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్‌, రింగ్‌ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా దక్కించుకున్నారనేది కథ.
నటీనటులు : 
నవదీప్‌ మామూలుగా నటించినా.. తను చాలా మంచివ్యక్తిగా నటించే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడా అది అతనికి సూట్‌ కాలేదు. డ్రగ్స్‌కు అలవాటుపడిన ప్రదీప్‌, కీరిటీ పాత్రలు కథకు ఏమంత సరిపడలేదు. ఇక నవీన్‌చంద్ర పాత్ర దొంగతనాలు చేసేవాడిగా నటించాను. ఆ రఫ్‌నెస్‌ యాక్షన్‌లో లేదు. ఇక మిగిలినవారంతా కొత్తవారు కావడంతో కథలో అలా సాగిపోయింది. సీనియర్స్‌ పోసాని వంటివారు వారి పాత్రల మేరకు ఫర్వాలేదు.
 
టెక్నికల్‌గా... 
సాయికార్తీక్‌ ట్యూన్స్‌ పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. ఇంతకుముందు పటాస్‌కు చేశాడు. ఫాస్ట్‌బీట్‌ బాగానే చేశారు. ఈ సినిమాలో అంతగా చేయడానికి ఏమీలేదు. కథను ఎంచుకున్న కార్తీక్‌వర్మ డైలాగ్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కడా ఆకట్టుకునేట్లుగా వుండవు. డిజిటల్‌ ఫార్మెట్‌లో తీయడంలో ప్రత్యేకత ఏమీ అనిపించదు. భరణి ధరణి కెమెరా పర్వాలేదు. ఎడిటర్‌కు చాలా పనిపడింది. స్క్రీన్‌ప్లే రివర్స్‌లో దర్శకుడు మొదటిభాగంలో చెప్పిన విధానం కాస్త కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తుంది. మొదటి భాగమంతా వారిని ఎలివేట్ చేయడానికే సరిపోయింది. 
 
విశ్లేషణ 
దొంగతనం, ఎస్కేప్‌ కావడం వంటి కాన్సెప్టుల్లో సస్పెన్స్‌ వుంటేనే థ్రిల్‌ వుంటుంది. ఈ సినిమాలో లేనిది అదే. మొదటి భాగమంతా చప్పగా సాగుతుంది. రెండో భాగంలో ఏమి జరుగుతుందనే ఇట్రెస్ట్‌ కాసేపు క్రియేట్‌ చేసినా అది చివరివరకు వుంచలేకపోయాడు దర్శకుడు. గంజాయి తాగితే ఎవరికివారు తెగ నవ్వుతారనే లాజిక్కునే ఎక్కువగా చూపించాడు. ముగింపు కూడా విలన్‌ చేత నవ్వించడం.. క్లె'మాక్స్‌లో విలన్‌ ఫూల్‌ చేయడం రొటీన్‌గానే వుంది. 
 
కథ, కథనం కొత్తగా వుంటేనే చిన్నతరహా చిత్రాలు ఆదరణ పొందుతాయి. ఇటువంటి కథలు ఎంచుకునేటప్పుడు దాన్ని ఎలా ప్రెజెంట్‌ చేయాలనేది దర్శకుడు మరింతగా ఆలోచించాలి. దీనికి అనుభవం చాలా ముఖ్యం. అది లేకపోతే తడబడటం మామూలే. ఈ సినిమా కేవలం మాస్‌ యూత్‌ను బేస్‌ చేసుకుని తీసినట్లుగా వుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రానికి రాకపోవచ్చు.
 
 
రేటింగ్‌: 2/5