Widgets Magazine

జవాన్ రివ్యూ రిపోర్ట్: కిక్ లేదు..

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (11:33 IST)

సినిమా పేరు : జవాన్ 
విడుదల తేదీ : డిసెంబర్ 1, 2017
న‌టీన‌టులు: సాయిధ‌రమ్ తేజ్, మెహ్రీన్, ప్ర‌స‌న్న‌, జ‌య‌ప్ర‌కాశ్ తదితరులు 
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: బివిఎస్ ర‌వి
నిర్మాత: కృష్ణ
సమర్పణ : దిల్ రాజు
 
విన్నర్, తిక్క వంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో.. జవాన్ సినిమా ద్వారా హిట్ కొట్టాలని సాయిధరమ్ తేజ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించారు. సమాజం, దేశంపై గౌరవం వున్న ఓ యువకుడు జై (సాయిధరమ్‌తేజ్) డీఆర్డీవోలో ఉద్యోగం చేయాలనుకుంటాడు.

డిఆర్డివో ఆక్టోపస్ అనే పెద్ద మిస్సైల్‌ను త‌యారుచేస్తుంది. దానివ‌ల్ల శ‌త్రుదేశాల‌ను నామ‌రూపాల్లేకుండా మ‌ట్టుపెట్టొచ్చు. ఆ మిస్సైల్‌ను తీసుకురావాల‌ని కేశ‌వ (ప్ర‌స‌న్న)తో డీల్ కుదుర్చుకుంటారు కొంద‌రు. ఈ డీల్‌కు జై అడ్డుపడతాడు. ఆ ఆక్టోపస్ చేరాల్సిన చోటుకు చేరిందా.. జై ఏం చేశాడు అనేదే కథ. 
 
దేశం కోసం ప్రాణాలిచ్చే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. దేశం కోసం ప్రాణాలిచ్చే దేశ‌భ‌క్తుడు ఓవైపు.. దేశం ఏమైపోయినా ప‌ర్లేదు నేను బాగుంటే చాలు అనుకునే స్వార్థ‌ప‌రుడి మధ్య జరిగే కథే జవాన్. తెలిసిన కథైనా.. ప్రేక్షకులను థ్రిల్ చేశాడు దర్శకుడు. ట్విస్ట్ లేకుండా కథ చెప్పుకుంటూ పోయాడు దర్శకుడు. హీరో, విల‌న్ మ‌ధ్య‌ మైండ్ గేమ్ ఎలా జరుగుతుందనేదే కథ. విల‌న్ ఆప‌రేట్ చేసే విధానం ఆసక్తికరంగా లేదు. 
 
ఇక హీరోయిన్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమాలో ఐదు పాట‌లుంటే.. అందులో హీరోయిన్‌తో నాలుగు ఉన్నాయి. జవాన్‌లో కిక్కు లేదు. జవాన్‌గా సాయిధ‌రంతేజ్ ర‌ప్ఫాడించాడు. కొన్ని స‌న్నివేశాల్లో ఒక‌ప్ప‌టి చిరంజీవిని గుర్తుకు తెచ్చాడు. మెహ్రీన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. విలన్‌గా ప్ర‌స‌న్న చాలా బాగా చేసాడు. మిగిలిన వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 
 
నెగటివ్ పాయింట్స్ 
పాటలు
విజువల్ క్లారిటీ 
 
ప్లస్ పాయింట్స్
గుహన్ సినిమాటోగ్రఫీ 
రచయితగా బీవీఎస్‌కు సక్సెస్ 
ఫ‌స్టాఫ్.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నజాజిలా మారిన అనుష్క.. అజిత్ విశ్వాసంలో నటిస్తోందట..

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ ...

news

బాహుబలికి అవార్డ్: బాహుబలి-3 వుండదన్న శోభు యార్లగడ్డ

జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి ...

news

కండోమ్స్ వాడితేనే మగాడు-బిపాసా, సన్నీకి పోటీగా వస్తున్నా: రాఖీ సావంత్

కండోమ్స్ వాడితేనే పురుషుడు మగాడు అనిపించుకుంటాడని బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ రాఖీ ...

news

నయనతార బాయ్‌ఫ్రెండ్‌తో సూర్య సినిమా.. ట్రైలర్ అదుర్స్

తమిళ హీరో సూర్య తాజాగా థానా సేర్‌దకూట్టం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాహుబలి ...

Widgets Magazine