Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యుద్ధంలో గెలిచామా లేదా అన్నదే పాయింట్... 'జవాన్' ట్రైలర్

గురువారం, 23 నవంబరు 2017 (10:15 IST)

Widgets Magazine
jawan movie still

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఈ చిత్రం వచ్చే నెల ఒకటో తేదీన విడుదల కానుంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్రం తేజు అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్, ఆసక్తిని రేకెత్తించేలా వుంది.
 
"యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.. ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం" అంటూ విలన్‌తో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందనిపిస్తోంది. 
 
దేశ ద్రోహుల కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తూ .. వాళ్ల బారి నుంచి ఒక వైపున తన కుటుంబాన్ని .. మరో వైపున తన దేశాన్ని కాపాడుకునే యువకుడిగా ఈ ట్రైలర్‌లో సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. మొత్తం మీద ఈ ట్రైలర్.. లవ్, యాక్షన్‌ సీన్లతో ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#ParuchuriGK‏ : పరుచూరి పలుకులు...

సృష్టిలో క్రిమి కీటకాలకు, పశుపక్ష్యాదులకు, దేనిపని దానికి, దేని ఆహారం దానికి ఉన్నప్పుడు ...

news

నారా లోకేష్‌ ఆ టైపే అనుకుంటా - తమ్మారెడ్డి మండిపాటు

నంది అవార్డుల వ్యవహారం కాస్త మెల్లమెల్లగా సద్దుమణుగుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్‌ ...

news

సాక్ష్యాలను తారుమారు చేస్తున్న దిలీప్.. పాస్ పోర్ట్ ఇచ్చేయాలట..

ప్రముఖ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా 85 రోజుల పాటు జైలులో ...

news

విజయ్ దేవరకొండతో "అర్జున్ రెడ్డి" హీరోయిన్‌లా చేస్తా : మెహ్రీన్

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళుతున్న భామ మెహ్రీన్. ...

Widgets Magazine