సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (22:54 IST)

ఆగస్టు 29న పోతారు. అందరూ సరిపోదా శనివారం' థియేటర్ కు పోతారు: నాని

Nani, Priyanka, SJ. Surya, danayy, kalyan
Nani, Priyanka, SJ. Surya, danayy, kalyan
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.  ఈ క్రమంలో  ప్రమోషన్స్  జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే  పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి.

తాజాగా పలు ప్రాంతాల్లో చిత్ర యూనిట్  చేసిన  ప్రమోషన్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈనెల 29న సినిమా విడుదలకాబోతుంది. అందులో భాగంగా శనివారంనాడు రాత్రి  'సరిపోదా శనివారం'  ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది. 
 
ఈ వేడుకలో దేవకట్టా, శ్రీకాంత్, సుధాకర్ చెరుకూరి, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ, ఎస్.జె. సూర్య, ప్రియాంక అరుణ్ మోహన్, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్   తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, అందరికీ థ్యాంక్స్. ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. త్వరలో తెలుస్తుంది మీకు. సినిమా గురించి చాలా చెప్పేశాను. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ట్రైలర్ లో చిన్నగా అరిశాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్ లో సక్సెస్ ఇవ్వాలి. వివేక్ ఏమి తీశాడో 29న మీకే తెలుస్తుంది. వివేక్ శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. ఇది వివేక్ కు మైల్ స్టోన్ లా వుంటుంది. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. జేక్స్ నా ఫ్యాన్. టెన్షన్ వున్నప్పుడు జేక్స్ ఆర్.ఆర్. ఇంటే రిలీఫ్ గా వుంది. సినిమాటో గ్రాఫర్ మురళీ గారు చాలా కేర్ తీసుకుని టేక్ ఎన్ని అయినా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేశాడు. 
ఈ సినిమాలో సోకుల పాలెం సెట్ అనేది రియల్ లొకేషన్ లా ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్ కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అద్రుష్టం వుంది. అందుకే సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. వివేక్ తో పనిచేయాలంటే టీమ్ చాలా కష్టపడాలి. ఈ సినిమా సక్సెస్ లో అందరికి భాగం వుంది. ఎగ్జిబిబటర్లు, పంపిణీదారులకు చెప్పాలంటే, కలిసివస్తే కాలం వస్తే నడిచివచ్చే సినిమా వస్తుందంటారు.. అలాంటి సినిమా సరిపోదా శనివారం. 
సాయికుమార్ గారు నాకు ఫాదర్ గా చేశారు. కానీ బాబాయ్ లా అనిపిస్తారు. ఆయనతో నటించడం పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి. అభిరామి, అతిది తదితరులు చక్కగా నటించారు. అలీ ఇందులో భాగం అయ్యారు. ప్రియాంక ను ఆఫ్ స్క్రీన్ లో ప్రేమలో పడతారు. ఈ సినిమా లో సూర్య, చారు పాత్రలను దర్శకుడు వివేక్ చక్కగా డీల్ చేశాడు. ఇక ఎస్.జె. సూర్య పాత్రకు మంచి పేరు వస్తుంది. దయా పాత్రకు ఆయనే సరియైన నటుడు. ఆగస్టు 29న పోతారు. అందరూ పోతారు. అందరూ థియేటర్ కు పోతారు. 29న సరిపోదా శనివారం చూస్తారు. 
 
చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, మా కుటుంబం అంతా ఈ వేడుకకు వచ్చి ఆశీస్సులు అందించారు. శ్రీకాంత్, ప్రశాంత్,శౌర్యవ్ తదితరులు వచ్చినందుకు థ్యాంక్స్.  ఈ సినిమా 29న విడుదలకావడానికి కారణం దర్శకుల టీమ్ కూడా ఓ కారణం. అంటే సుందరానికి రిలీజ్ రోజున కన్ ఫ్యూజ్ గా వున్నా. ఎదుకంటే కొందరు బాగుందని, మరికొందరు బాగోలేదని టాక్ వచ్చింది. దాంతో ఏ తరహా సినిమా చేయాలో అర్థం కాలేదు. నాని నాకు ఛాన్స్ ఇచ్చారు. అందుకే థ్యాంక్స్ చెబితే సరిపోదు అనుకుని ఆయనకు నాపై వున్న నమ్మకానికి సరిపోదా శనివారం సినిమా ఇచ్చా. అలాగే ఇతర నటీనటులు కూడా బాగా కుదిరారు. అందరూ రైటింగ్ బాగుందని అంటున్నారు. అది వీరి పెర్ ఫార్మెన్స్ తో ముందుకు సాగాను. ఎస్.జె. సూర్యకి ఏదైనా సీన్ చెప్పాలంటే భయమేస్తుంది. అయినా నేను చెప్పింది విని అంగీకరించారు అన్నారు. 
 
చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ అవుతుంది. నానిగారు కథల ఎంపికలో బెస్ట్. కథ నచ్చితే కొత్త దర్శకుడయినా అవకాశం ఇస్తారు.  నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు నాని. అదేవిధంగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. నాని ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి. ఇక ఎస్.జె. సూర్య నటనలో ఇరగదీశారనే చెప్పాలి. నా తర్వాత సినిమాలో కూడా ఆయనే చేయాలని కోరుకుంటున్నా. ప్రియాంక అద్భుతంగా నటించారు. అభిరామిగారు ఈ సినిమాలో తల్లిగా చేశారు. దర్శకుడు ఏడాదిపాటు కథ రాశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. వివేక్ సినిమా అంటే అంటే సుందరానికి లాంటిది తీస్తాడేమోనని అనుకున్నాను. కానీ మంచి సినిమా తీశాడు. పెద్ద దర్శకుడు కోవలో చేరతారు. సంగీతం దర్శకుడు జేక్స్ బిజోయ్ రీరికార్డింగ్ బాగా చేశాడు. ఈ సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ లో కలుద్దామని అన్నారు.
 
హనుమాన్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, నానిగారు  ఆ  అనే సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ తర్వాత జాంబిరెడ్డి చేయగలిగాను. దానయ్య గారికి కంగ్రాట్స్.  ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఈ సినిమా పేరు రావాలి. ఖుషి సినిమాచూసి ఎస్.జె. సూర్య ఫ్యాన్ అయ్యాను. ఆ రోజంతా సినిమానే చూశాను. సినిమా అంటే అంత పిచ్చి. హనుమాన్ కు సూర్య గారిని అనుకున్నాం. కానీ కుదరలేదు. మరో సినిమాకు తప్పకుండా సూర్య గారితో చేయాలి.  ఇక వివేక్ కు ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలి. దానయ్య, కళ్యాణ్ గారికి మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నా అన్నారు.
 
ఎస్.జె. సూర్య మాట్లాడుతూ, సరిపోదా శనివారం చాలా మంచి మూవీ. అందరూ చూసి ఎంకరేజ్ చేయండి. వివేక్ ఆత్రేయ రచన భిన్నమైంది. ఆయన చెన్నై కి వచ్చి నాకు కథ చెప్పారు. ఆయన నెరేషన్ విన్నాక చాలా ఆనందం కలిగింది. ఇటువంటి రచయితలను అరుదుగా చూస్తుంటాం. ఒకరకమైన యాక్షన్ సినిమాను విభిన్నంగా వివేక్ మలిచారు. అన్ని యాక్షన్ సినిమాలు మాణిక్ బాషా కాన్సెప్ట్ లోనే వుంటాయి. ఈవెన్  బాహుబలి 2, ఇంద్ర కూడా మానిక్ బాషా కాన్సెప్ట్ వుంది. అలాంటి తరహా సినిమాలకు కొత్త తరహా యాక్షన్ వివేక్ తీసుకువచ్చారు. విషయం ఏమంటే... సినిమాలో నాని తల్లి కొడుకును ఏంగ్రీ  వుండకూడదు అని ప్రామిస్ తీసుకుంటుంది. అందుకే   శనివారం అని ఫిక్స్ చేశారు. మిగిలిన రోజుల్లో మానిక్ గా వుండే నాని శనివారం బాషా గా మారతాడు. ఇటువంటి కాన్సెప్ట్ మరీ మరీ చూసేవిధంగా వుంటుంది. 
ఇక కానిస్టేబుల్ గా ప్రియాంక అందంతోపాటు నటనను కనబరిచారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా అన్ని శనివారం నాడు కొన్ని మ్యాజిక్ లు జరిగాయి. నాది, నాని, సాయికుమార్ లతోపాటు అందరి పుట్టినరోజులు శనివారమే వచ్చాయి. ఇక డివివి బేనర్ ఫెంటాస్టిక్ కంపెనీ. నాని చాలా మంచి మనిషి, నటుడు. విజన్ వున్న నటుడు. సినిమాలపై తపన వుంది. అసిస్టెంట్ దర్శకుడినుంచి ఈ స్థాయికి చేరారంటే ఆయన కష్టమే ఫలించింది. నేను ఇందులో డబ్బింగ్ ఫర్ఫెక్ట్ గా చెప్పాను. వివేక్ గారు చాలా ట్రిక్కీగా పాత్రలను డిజైన్ చేశాడు. అలా నా పాత్ర దయాను మలిచారు. 
 
కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ, నాకు ఇది స్పెషల్ ఫిలిం. దానయ్యగారు నాకు ఓజి. సినిమాలో కూడా అవకాశం కల్పించారు. నా కెరీర్ లో ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. అందుకు కళ్యాణ్, దానయ్యగారికి థ్యాంక్స్. వివేక్ గారు మంచి పాత్ర ఇచ్చారు. వివేక్ మాస్ సినిమాలు బాగా తీస్తాడని అనిపిస్తుంది. ఎస్.జె. సూర్య తో తమిళంలో డాన్ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. ఇందులో చాలా నేర్చుకున్నాను. అలాగే ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్ తో చేయండి. నానిగారితో రెండవ సినిమా చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నానిగారు నిజంగానే ట్రెజర్ హంటర్ అని చెప్పాలి. 
 
సంగీత దర్శకుడు జేమ్స్. మాట్లాడుతూ, తెలుగులో నాకిది నాల్గవ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ భాగంగా ఆర్.ఆర్. కూడా రెడీ అవుతోంది. అయినా సక్సెస్ పై నమ్మకం వచ్చేసింది. ఇటీవలే క్లయిమాక్స్ చూశా. అద్భుతంగా వచ్చింది. దానయ్యగారు చూసి అద్భుతం అన్నారు. నానిగారికి మ్యూజిక్ సెన్స్ కూడా వుంది. సినిమా గురించి పూర్తి అవగాహన కూడా వుంది. ఎస్.జె. సూర్య ఈ సినిమాలో శివతాండవం చేశారనే చెప్పాలి అన్నారు. 
 
దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ,  నాని, ఎస్.జె. సూర్య కాంబినేషన్ చాలా ఫ్రెష్ గా వుంది. గ్యాంగ్ లీడర్ లో ప్రియా, నాని కాంబినేషన్ బాగుంది. వివేక్ తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలని తాపత్రయం కనిపించింది. ఆయనకు పెద్ద హిట్ కావాలి. నాని, వివేక్ కాంబినేషన్ లో బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
మరో దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ, ఈ సినిమా గ్లింప్స్ నుంచి చాలా ఆసక్తిగా అనిపించింది. కాన్సెప్ట్ చాలా బాగుంది. నాని, నేను సినిమా అంటే పిచ్చి. సినిమానే ప్రేమిస్తాం. మేం ఎక్కడ కలిసినా సినిమాల గురించే మాట్లాడుకుంటాం. నానికి సినిమా అంటే ట్రెజర్ హంటర్ లాంటివాడు. సినిమా అనేది ఒక్కో శైలిలో వుండేలా చూసుకుంటాడు. 30వ సినిమా దసరా చేశాడు. 31వ సినిమా కూడా కొత్త దర్శకుడితో చేశాడు. ఇది  32వ సినిమా చేశాడు. ఆడియన్ ను ద్రుష్టిలో పెట్టుకుని కథ వింటాడు. అందుకే ఇండస్ట్రీకి నాని ట్రెజర్ లాంటివాడు. ట్రెజర్ హంటర్ ఎందుకంటే ఇంకా కొత్త దర్శకులకోసం వెతుకుతూనే వున్నాడు. 32కాదు ఇంకా 64 సినిమాలు తీయాలి. ఇక సూర్య నటుడిగా, దర్శకుడిగా అభిమానిని. ప్రియాంక మరలా తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా వుంది. దానయ్యగారికి మంచి సినిమా అవ్వాలని ఆకాంక్షించారు. 
 
నటుడు అలీ మాట్లాడుతూ, దేశముదురు ,జులాయి, గంగతో రాంబాబు వంటి ఎన్నో సినిమాలు తీసిన దానయ్యగారితో ఆర్.ఆర్.ఆర్. వంటి సినిమాను తీసి హాలీవుడ్ లో మన ఖ్యాతిని చాటారంటే రాజమౌళి గారు కారణం. రాఘవేంద్రగారి దగ్గర నాని అసిస్టెంట్ గా పనిచేసి తనలోని నటుడిని వెలికితీసి సక్సెస్ సాధించారు. ఈ సినిమాలో నానితో నటించాను. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నాని సినిమాలో చేశా. ఇక దానయ్యగారికి ఈ సినిమా, ఓ.జి.తో సిరిసంపదలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
నిర్మాత చెరుకూరి సుధాకర్ మాట్లాడుతూ, దసరా సినిమా తర్వాత నిర్మాత కళ్యాణ్ తో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. వివేక్ లాంటి దర్శకులు అరుదుగా కనిపిస్తారు. బ్రోెచెవారెవరురా సినిమా చూశాక, నేను ఇంటర్ చదువున్న రోజుల్ని గుర్తు చేశాడు. అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. నాని మాస్ సినిమాలే చేయాలి. జర్సీ, నిన్నుకోరి వంటి క్లాస్ సినిమాలుచేసేశావ్. అని తెలిపారు. 
 
హాయ్ నాన్న దర్శకుడు శౌర్యవ్ మాట్లాడుతూ, సరిపోదా శనివారం వివేక్ గారికీ, అందరికీ సస్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
నటి అతిధి మాట్లాడుతూ, వివేక్ ఆత్రేయ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరూ బాగా నటించారు. దానయ్యగారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
నటి అనితా చౌదరి మాట్లాడుతూ,  దర్శకుడు వివేక్ చేసిన మెంటల్ మదిలో చిత్రంలో నేను నటించాను. ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ కు సరిపోదు శనివారం అనేట్లుగా వుంటుంది. అందుకే 29వ తేదీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా అన్నారు. 
 
నటి అభిరామి మాట్లాడుతూ, నిర్మాత డివివి దానయ్య, కళ్యాణ్, నాకు ఇందులో మంచి రోల్ ఇచ్చారు. లక్కీగా ఫీలవుతున్నా.  దర్శకుడు వివేక్ టేకింగ్ చేస్తే, నాని అద్భుతమైన నటనను కనబరిచారు. ఎక్కడ టాలెంట్, హార్డ్ వర్క్ వుంటే దాన్ని తెలుగు వారు గుర్తిస్తారు, అందుకు సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.