'లైఫ్‌ అంటే నాదే అనుకున్నా'నంటున్న గోపీచంద్ : ఆక్సిజన్ ట్రైలర్

శనివారం, 30 సెప్టెంబరు 2017 (14:30 IST)

శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌‌లు జంటగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం ట్రైలర్ విజయదశమి కానుకగా దర్శకుడు ఎ.ఎమ్‌.జ్యోతికృష్ణ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చగా, త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
oxygen movie still
 
'సంతోషాన్ని పంచే అమ్మానాన్న... నవ్వుతూ పలకరించే ప్రియురాలు.. పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే స్నేహితులు.. లైఫ్‌ అంటే నాదే అనుకున్నాను. ఒక్కరోజు అంతా చీకటైపోయింది. నాకు జరిగింది.. మీకూ జరగచ్చు. కానీ అలా జరగనివ్వను' అంటూ ఈ ట్రైలర్‌లో గోపీచంద్ డైలాగ్‌లు చెప్పడం వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు మగధీర సీక్వెల్...?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ఆణి ముత్యాల్లో "మగధీర" ఒకటి. ఈ చిత్రం ...

news

బొట్టు పెట్టి ఇదే ఇండియన్ ట్రెడిషన్ అంటోంది... వామ్మో ఏం హాటో(ఫోటోలు)

మోడలింగ్... ఈ రంగం గురించి చెప్పుకుంటే అందాలను ఆరబోయడమే. తమకున్న అవయవ సౌష్టవాన్నంతా ...

news

దీపావళికి పవన్ - త్రివిక్రమ్ టీజర్...

హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో పీకే 25వ చిత్రం ...

news

కుర్రోళ్లను కుదురుగా ఉండనివ్వని బాలీవుడ్ బ్యూటీ...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటీవలి కాలంలో మంచి విజయాలబాటలో పయనిస్తోంది. ఇటు ...