ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By TJ
Last Modified: ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (20:19 IST)

శ్రీవారి కాసుల హారాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయ్.. గోవిందా...

తిరుమల శ్రీవారికి ఆభరణాలకు కొదవా... ఆపద మ్రొక్కులవాడికి ఎప్పుడూ ఆభరణాలు వస్తూనే ఉంటాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విజయవాడకు చెందిన రామలింగరాజు అనే భక్తుడు శ్రీవారికి 29 కిలోల బంగారు సహస్రనామ కాసుల హారాన్ని కానుకగా సమర్పించారు.

ఐదు పేటల బంగారు హారాన్ని 28.645 కిలోల బంగారంతో తయారు చేశారు. మొత్తం 8.39 కోట్ల వ్యయంతో తయారుచేసిన ఈ హారంలో 1008 కాసులున్నాయి. ఒక్కో కాసుపై సహస్రనామావళిని ముద్రించారు. ఈ హారాన్ని బహూకరించిన దాత అమెరికాలో స్థిరపడ్డారు. 2013 సంవత్సరంలో కూడా 16 కోట్ల రూపాయల విరాళాన్ని స్వామివారికి అందించారు. ఇంత పెద్ద హారం స్వామివారికి ఇవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు టిటిడి అధికారులు.