మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (15:33 IST)

అన్నాశాలైలో బైక్‌ స్టంట్‌ చేసిన హైదరాబాద్‌ అబ్బాయ్.. కోర్టు భలే తీర్పు! (video)

Hyderabad Boy
Hyderabad Boy
తమిళనాడులో కొందరు యువకులు, విద్యార్థులు విన్యాసాలు, బైక్ రేసుల్లో పాల్గొంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా కొంతమంది ప్రజలకు భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. 
 
ఆ క్రమంలో ఇటీవల చెన్నైలోని అన్నాశాలైలో బైక్‌ స్టంట్‌కు పాల్పడిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్‌ కోట్ల పినోయ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, కేసులో సంబంధమున్న ఐదు మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బినోయ్ కొద్ది రోజుల క్రితం చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ రోజు కేసును విచారించిన జస్టిస్ జగదీస్ చంద్ర, సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు బైక్ స్టంట్ జరిగిన ప్రదేశంలో వాహన అవగాహన ప్రచారంలో పాల్గొంటారు. మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేయాలని తెలిపారు.