శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (18:43 IST)

గన్నవరంలో కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో విమానం రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విమానంలో మొత్తం 64 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా వున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ విమానానికి ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారిస్తున్నారు. అసలు విమానం ల్యాండింగ్ సమీపంలో ఎలాంటి స్తంభాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది విచారిస్తున్నారు.