శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (15:58 IST)

మోడీజీ.. నాలుగేళ్లలో ఏం చేశారు : బీజేపీ ఎంపీ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సొంత పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్ళ కాలంలో దళితులకు ఏం చేశారంటూ ఆయన నిలదీశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సొంత పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్ళ కాలంలో దళితులకు ఏం చేశారంటూ ఆయన నిలదీశారు. ఆ ఎంపీ పేరు యశ్వంత్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నగినా నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ప్రధానికి రాసిన ఓ లేఖలో.. 
 
దేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితులకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల పాలనలో దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించిందని ఆరోపించారు. దళితుడినైన తాను తన సామర్థ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేక పోతున్నానని... కేవలం రిజర్వేషన్ల వల్లే తాను ఎంపీని కాగలిగానని చెప్పారు. 
 
తాజాగా, ఎస్సీ, ఎస్టీ కులవివక్ష నిర్మూలనా చట్టాన్ని జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే బీజేపీకి చెందిన మరో గిరిజన తెగగు చెందిన ఎంపీ చోటే లాల్ ఖర్వార్ కూడా ప్రధానికి లేఖ రాశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనను అవమానించారంటూ లేఖలో పేర్కొన్నారు. మొత్తంమీద ప్రధాని మోడీ సర్కారు దళితుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిపై ఆ పార్టీలోని దళిత నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేసే పరిస్థితికి వచ్చారు.