Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నువ్వు మాల, మాదిగ? మీ అయ్య ఏం పనిచేస్తాడు?' ప్రయాణికుడికి వర్ల రామయ్య షాక్ (Video)

శుక్రవారం, 11 మే 2018 (08:10 IST)

Widgets Magazine

ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ ప్రయాణికులకు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనను పట్టించుకోని ఓ ప్రయాణికుడిని చీవాట్లు పెట్టారు. అంతేనా నీదేం కులం.. మీ అయ్య ఏం చేస్తుంటారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వర్ల రామయ్యగారు ఆకస్మిక తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఇదేమీ పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది గమనించిన వర్ల రామయ్య ఆ ప్రయాణికుడి కులం గురించి అడిగి తెలుసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
'బస్సు ఎక్కాం.. దిగాం.. వాడు మాత్రం మనను చూడలేదు. అది డేంజర్.. వాళ్ల నాన్నకు వీడేమీ ఉపయోగపడడు..' అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడి వద్దకు వెళ్లి 'నువ్వు మాల, మాదిగ?' అని ప్రశ్నించారు. 'మీ అయ్య ఏం పనిచేస్తాడు? మీ అమ్మ? ఎన్ని ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి. మరి ఎట్లా చదువుకుంటావు? కష్టపడాలి.. ఫోన్‌లో పాటలు వినడం కాదు' అని మందలించారు.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముఖ్యమంత్రి పి.ఏనంటూ బుగ్గ కారుతో హల్చల్... బోగస్ గన్ మేన్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడినని నంటూ పలువురిని నమ్మించి పోలీసులకు ...

news

వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికే ఇళ్లు... ఎలా గుర్తించడం?

అమరావతి: అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయం ...

news

మైనింగ్ కేసుకి రూ. 160 కోట్ల లంచం... శ్రీరాములు భాజపాను అడ్డంగా బుక్ చేసేశాడా

గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడిగా పేరున్న శ్రీరాములుకి సంబంధించి ఓ వీడియో టేప్ ఇప్పుడు ...

news

కర్ణాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో లగడపాటి చెప్పిన సర్వే చూస్తే షాకే..

ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు బిజెపి, మరోవైపు ...

Widgets Magazine