సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:10 IST)

బియ్యం లేదు ఏం చేయమంటారు..? అందుకే కింగ్ కోబ్రాను తినేశాం.. ఎక్కడ?

King cobra
చైనాలో పాములు, గబ్బిలాలు తినడం ద్వారానే కరోనా వైరస్ వచ్చిందనే వాదన వుంది. ప్రస్తుతం అదే పరిస్థితి దేశంలో ఉత్పన్నమైంది. ఇందుకు కూడా కరోనానే కారణం. ఎందుకంటే.. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బియ్యం దొరకక అరుణాచల్ ప్రదేశ్‌లో పాముల్లో శ్రేష్టమైన, అరుదైన రాజనాగాన్ని ఆహారంగా తీసుకున్నారు. 
 
ప్రస్తుతం ఈ షాకింగ్ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వేటగాళ్ల బృందం వారి మెడలో 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను చుట్టుకుని వున్నారు. ఇంకా ఆహారం కోసం ఆ పామును బలిగొన్నారని.. బియ్యం దొరకకపోవడంతో అరుణాచల్ ప్రదేశ్‌లో కింగ్ కోబ్రాను ఆహారంగా తీసుకున్నట్లు ఆ వేటగాళ్లు చెప్పారు. 
 
లాక్ డౌన్ కారణంగా అటవీ సర్పాన్ని చంపినట్లు తెలిపారు. ''లాక్ డౌన్ కారణంగా బియ్యం లేదు. ఆకలితో వున్నాం. ఇంకా మాంసం తినాలపించింది. కాబట్టి అడవికి వెళ్లి రాజనాగాన్ని పట్టుకొచ్చి ఆహారంగా తీసుకున్నాం. ఈ చర్యతో ప్రభుత్వ అధికారులు దయచేసి క్షమించండి. సాధారణంగా తాము ఇలాంటి పని చేయం.. ఆకలి బాధతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని'' ఆ ముగ్గురిలో ఒకరు వీడియో చెప్పారు. 
 
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. విచారణ మొదలెట్టారు. ఇంకా కింగ్ కోబ్రాను చంపి తినిన ముగ్గురు వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. ఇంకా ఆ ప్రదేశానికి వెళ్లిన అటవీ శాఖాధికారులను వేటగాళ్ల బృందం, ఆ ప్రాంత నివాసితులు చుట్టుముట్టడంతో వారు వెనక్కి రావాల్సి వచ్చింది. ఇంకా కురుంగ్ కుమే జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని అరుణాచల్ వైల్డ్ లైఫ్ వార్డెన్, డిప్యూటీ చీఫ్ ఉమేష్ కుమార్ తెలిపారు.
 
ఈ ఘటనపై ముఖ్యమంత్రి పెమా ఖండు మాట్లాడుతూ... వన్యప్రాణులను అక్రమంగా వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో కనీసం మూడు నెలల మేర ఆహార ధాన్యాలు నిల్వలో వున్నాయని.. జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్ అందిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఇంకా పామును బలిగొన్న వారిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.