Widgets Magazine

పవన్ 'దేవుడు'కే బండ్ల 'భక్తుడు' భలే హల్వా పెట్టేశారుగా...

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (13:55 IST)

బండ్ల గణేష్ అనగానే పవన్ కల్యాణ్ మాట కూడా వినబడుతుంది. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో భక్తి అనీ, ఆయన తనకు దేవుడు అని నిర్మాత బండ్ల గణేష్ చెప్తుంటారు. అలాంటి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తనకు చిన్నప్పట్నుంచి హస్తం పార్టీ అంటే పిచ్చి అభిమానమనీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో చెప్పలేనంత ఇష్టమని అన్నారు బండ్ల. ఇప్పుడు ఎందుకో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని అపించిందనీ, ఎలాగూ తనకు చిన్నప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కనుక ఆ పార్టీలో చేరిపోయినట్లు వెల్లడించారు.
Pawan-Bandla
 
ఆ సమాధానం వినగానే అక్కడే వున్న కొందరు మీడియా ప్రతినిధులు... మరి పవన్ కళ్యాణ్‌ను దేవుడు అంటూ ఎంతో ఇష్టంగా ఆయన గురించి మాట్లాడుతుంటారు కదా... పవన్ తన పార్టీ జనసేనలోకి ఆహ్వానిస్తే ఏం చేస్తారు అని అడిగారు. దానికి బండ్ల మాట్లాడుతూ... తను పూటకో పార్టీ మార్చే రకం కాదనీ, రాజకీయాల్లో వున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే వుంటానని గట్టిగా చెప్పారు. అంతేకాదు... తనకు పార్టీ పదవి యిచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం తను పనిచేస్తానని సెలవిచ్చారు.
 
కాగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై షాద్‌నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి బండ్ల రాజకీయాల్లో ఏం చేస్తారో చూడాలి. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పురీష నాళమే సాధనంగా స్మగ్లింగ్.. బంగారాన్ని అలా దాచేశాడు..

స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను స్మగ్లింగ్‌ కోసం ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ...

news

నిన్ను మరిచిపోలేనురా.... భర్తను చంపి జైలుకెళ్తా.. బెయిలుపై విడిపించు... కన్నింగ్ లేడీ

ప్రియుడు మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపేసింది. తనకు ఇద్దరు పిల్లలున్నారన్న ...

news

పక్కలోకి రాలేదనీ.. భార్యను ఫ్యాన్‌కు ఉరివేసి చంపేసిన భర్త

రాత్రిపూట పక్కలో పడుకోవడం లేదని ఆగ్రహించిన ఓ కసాయి భర్త... కట్టుకున్న భార్యను ఫ్యాన్‌కు ...

news

దొంగ బాబా అరెస్ట్.. తల్లీకూతుళ్లపై అత్యాచారం.. ఎక్కడ?

ప్రజల్లో ఇంకా మూఢ నమ్మకాలు, జాతకాలు, బాబాలపై నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దొంగ బాబాల చేతిలో ...

Widgets Magazine