Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్ అవసరమా? చెన్నై టీమ్ నల్ల బ్యాడ్జ్ ధరించి ఆడండి: రజనీ

ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (15:51 IST)

Widgets Magazine
rajinikanth

కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్‌ను అన్నాడీఎంకే ఎంపీలు స్తంభింపజేశారు. ఈ క్రమంలో వైకాపా, టీడీపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చే జరగకుండా పోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతూ, కావేరీ నదీ జలాల కోసం నిరసనలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తమిళ సినీ తారలు కావేరి జలాల కోసం సినీ తారలు మౌనదీక్ష చేపట్టారు. చెన్నైలోని వల్లువర్ కోట్టమ్‌లో కావేరీ జలాల కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కోలీవుడ్ హీరోలు విజయ్, సూర్య, సత్యరాజ్, శివకుమార్, ధనుష్,నాజర్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరం వద్దకు వచ్చి సినీతారలకు అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ మద్దతు పలికారు. 
 
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగునీటి సమస్యలుండగా, ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎందుకంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ, క్రికెట్ పోటీలు జరుగుతూ ఉండటం తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తోందన్నారు. 
 
ఈ పోటీల్లో క్రీడాకారులు ప్రజల నిరసనలకు మద్దతుగా కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ క్రీడాకారులు తమిళనాడుకు మద్దతుగా నల్ల బ్యాడ్జ్‌లను ధరించాలని కోరారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఢిల్లీలో విజయమ్మ.. రాజశేఖర్ రెడ్డి వుండివుంటే ఇలా జరిగివుండేది కాదు..?

ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైకాపా ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష ...

news

ప్రజలంతా జంతువులే.. ఆ ఇద్దరు మాత్రం జంతువేతరులు: రాహుల్

విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై ...

news

అత్యాచారం జరిగిందని అబద్ధం చెప్తారా? శరీరంపై గాయాలు లేకపోతే?

అత్యాచార బాధితురాలు అబద్ధాలు చెప్పరని బాంబే హైకోర్టు తెలిపింది. ఓ పరువుగల కుటుంబం నుంచి ...

news

ప్రియా వారియర్ ఆ సినిమాలో 20 నిమిషాలే కనిపిస్తుందట.. అందుకే రీషూట్?

''ఒరు అదార్ లవ్'' సినిమా కంటే ఆ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయింది. ...

Widgets Magazine