శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (18:00 IST)

చేపాక్ స్టేడియం వద్ద ఆందోళనలు.. సినీ దర్శకులపై లాఠీ ఛార్జ్.. ఉద్రిక్తత

చెన్నై చేపాక్ క్రికెట్ మైదానంలో బ్యానర్లు, జెండాలను తీసుకెళ్లెందుకు తమిళ క్రికెట్ సంఘం నిషేధం విధించింది. కావేరి బోర్డు నియమించలేదని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ సంఘాలన్నీ చేపాక్ స్టేడియం వద్ద ఆ

చెన్నై చేపాక్ క్రికెట్ మైదానంలో బ్యానర్లు, జెండాలను తీసుకెళ్లెందుకు తమిళ క్రికెట్ సంఘం నిషేధం విధించింది. కావేరి బోర్డు నియమించలేదని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ సంఘాలన్నీ చేపాక్ స్టేడియం వద్ద ఆందోళనలకు దిగినా ఫలితం లేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్టు సభ్యులను పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియం చేరుకున్నారు. 
 
కావేరి బోర్డుపై కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడంతో తమిళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఐపీఎల్ పోటీలు నిర్వహించకూడదని రాజకీయ పార్టీలు, రైతులు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య చేపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను అడ్డుకునేందుకు స్టేడియం ముందు భారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంకా క్రికెటర్ల బస్సును అడ్డుకునేందుకు వాలాజా రోడ్డుపై ఆందోళనకు దిగిన ప్రముఖ సినీ దర్శకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో చెన్నై నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.