గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (20:23 IST)

మామతో ఎఫైర్... లవర్‌తో రొమాన్స్... మధ్యలో టీవీ యాంకర్... లింకేంటి?

విజయవాడలో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చెప్పిన విషయాలు ఇప్పటికే సంచలనమయ్యాయి. తనంటే తన మామయ్యకు చచ్చేంత ప్రాణమనీ, తనతో లైంగిక సంబంధం కోసం వెంపర్లాడటంతో చివరికి ఒప్పుకున్నానని ఆమె తెలియజేసినట్లు సమాచారం.
 
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి శిఖా చౌదరితో పాటు ఆమె ప్రియుడు రాకేశ్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఐతే వీరితో పాటు మరో యువతిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె జయరాంకు పీ.ఎగా పనిచేస్తోందనీ, అతడికి సంబంధించిన కీలక వ్యవహారం మొత్తం ఈమెకు తెలుసనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
హతుడికి వ్యక్తిగత కార్యదర్సిగా వున్న ఈమె గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ యాంకర్‌గా పనిచేసిందని చెప్పుకుంటున్నారు. ఆ చానెల్ మూసివేశాక జయరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ చివరికి అతడి పిఎగా వ్యవహరిస్తోందని అంటున్నారు. మరి ఈమె చెప్పే విషయాలు హత్యలో మరిన్ని కోణాలను బయటపెడతాయోమో చూడాలి.