సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (17:00 IST)

వెళ్లి పడుకో... హమ్మ, ఏపీ భాజపా నేత విష్ణును హీరో సిద్ధార్థ్ ఎంత మాటన్నాడు?

సినీ హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో యాక్టివ్. అలాగే భాజపా నాయకులపైన కూడా విమర్శలు చేస్తుంటారు. ఈమధ్య కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. దీనితో భాజపా నాయకులు సైతం రివర్స్ ఎటాక్ చేసారు.
 
వీరిలో ఏపీ భాజపా నాయకుడు కూడా వున్నారు. సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడంటూ ట్విట్టర్ వేదిగా విష్ణు ఆరోపించారు. ఈ ట్వీట్ చూసిన సిద్ధార్థ్ మరింత ఆగ్రహం వ్యక్తం చేసాడు.
 
'కాదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని. ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఇపుడీ ట్వీట్ వైరల్‌గా మారింది. భాజపా నాయకులు మాత్రం సిద్ధార్థ్ ను పట్టించుకోవద్దని చెప్పారట.