మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (12:03 IST)

వరుణ్ నిజమైన వారియర్‌.. కరోనా పట్టుకున్నా వదల్లేదు.. ఆక్సిజన్ అలా అందించాడు..?

వరుణ్ కుమార్... ఆంధ్రప్రదేశ్‌... చిత్తూరు కుర్రాడు. బెంగళూరులో... ఫార్మా వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు 2020లో లాక్‌డౌన్ ఉన్నప్పుడు... వరుణ్‌కి ఆశ్చర్యపోయే ఘటన ఒకటి జరిగింది. అది అతని మనసుని కదిలించింది. ఓ వలస కూలీ... అతని కారు విండోని కొట్టాడు. ఆహారం అడిగాడు.

అంతే కారులోని వరుణ్ ఆ క్షణం నుంచి మారిపోయాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి... వారి సాయంతో... రోజూ కొంతమందికి ఉచితంగా భోజనాలు పెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఇవేవీ సరిపోవు అనుకున్నాడు. ఓ అపార్ట్‌మెంట్ కొనేందుకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.5 లక్షలు వెనక్కి తీసుకొని ఖర్చు పెట్టాలని అనుకున్నాడు.

అదే చేశాడు. లాక్‌డౌన్ సమయంలో మొత్తం 12000 వలస కూలీలకు ఆహారం పెట్టాడు. అంతేకాదు... 5000 డ్రై రేషన్ కిట్లు అవసరమైన వారికి ఇచ్చాడు. ఫలితంగా వందల మంది ఆకలి చావుల నుంచి బయటపడ్డారు.
 
అలాగే ఈ సంవత్సరం... కరోనా వరుణ్‌ని కూడా పట్టుకుంది. దాన్ని వదిలించుకున్నాడు. మళ్లీ యాక్షన్‌లోకి దిగి... బెడ్లు లేని వారికి... అవి వెతికి పెడుతున్నాడు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా SOS కాల్స్ అందుకుంటూ... సాయం చేస్తున్నాడు. చిత్తూరులో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి మెడికల్ కిట్స్, ఇతరత్రా అవసరమైనవాటిని పంచాడు. ఇంత చేసినా... తాను చేసింది ఏమీ లేదు అంటున్నాడు. రోజూ 300కు పైగా SOS కాల్స్... వరుణ్‌కి వస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులవే. రోజులో ఎక్కువ సమయం... ఈ కాల్స్ అందుకోవడం, పేదవారికి సాయం చేయడంతోనే సరిపోతోంది.
 
తాజాగా ఈ వరుణ్ ఎనిమిది మంది పేషెంట్లను కాపాడాడు. అధికారులకు సమాచారం చేరవేసి.. 90 నిమిషాల్లో ఆక్సిజన్ అందజేశాడు. వరుణ్ నుంచి రిక్వెస్ట్ రాగానే... ACP... స్పందించారు. వెంటనే ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర... ఆస్పత్రి వాహనాలకు ముందుగా ఆక్సిజన్ నింపేలా చెయ్యమని స్థానిక పోలీసులను ఆదేశించారు అంతేకాదు... ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్‌కి ACP కాల్ చేసి మాట్లాడారు. దాంతో ఫిల్లింగ్ స్టేషన్ వారు... "ఓకే సార్... ముందు... ఆస్పత్రి వెహికిల్స్‌కే నింపుతాం" అని హామీ ఇచ్చారు.
 
టైమ్ పరుగెడుతోంది. ఈ సమయంలో... వరుణ్... అటు ఆస్పత్రి వర్గాలు, ఇటు ఫిల్లింగ్ స్టేషన్ వర్గాలతో టచ్‌లో ఉంటూ... ఎప్పటికప్పుడు సమాచారం అటూ ఇటూ చేరవేస్తున్నాడు. ఆ తర్వాత శరవేగంగా ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఆక్సిజన్ నింపడం... ఆ వాహనాలు ఆస్పత్రికి వెళ్లడం... వెంటనే పేషెంట్లకు ఆక్సిజన్ గ్యాప్ లేకుండా చెయ్యడం అన్నీ జరిగాయి. అలా... వరుణ్ చొరవతో... 8 మంది పేషెంట్ల ప్రాణాలు నిలిచాయి.