నా హీరో ఆయనే... అన్నయ్యను అంటే కొట్టేంత కోపం వస్తుంది : పవన్

కోట్లాది మంది అభిమానులకు అన్నయ్య ఎలా హీరోనే.. నాకు కూడా ఆయనే హీరోనని, ఆయన్ను మాత్రం ఎవరైనా ఒక్కమాట అంటే మాత్రం కొట్టేంత కోపం వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో తనను ఎన్ని మా

pawan kalyan
pnr| Last Updated: మంగళవారం, 10 జులై 2018 (15:41 IST)
కోట్లాది మంది అభిమానులకు అన్నయ్య ఎలా హీరోనే.. నాకు కూడా ఆయనే హీరోనని, ఆయన్ను మాత్రం ఎవరైనా ఒక్కమాట అంటే మాత్రం కొట్టేంత కోపం వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో తనను ఎన్ని మాటలు అన్నా తాను భరిస్తానని చెప్పారు.
 
అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడితో పాటు పలువురు ముఖ్యనేతలు సోమవారమిక్కడ గచ్చిబౌలిలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది. నా ఒక్కడిది కాదు. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. నాకు ఒక్కరే హీరో. ఆయనే చిరంజీవి అని అన్నారు. 
 
తనకు తాను ఎప్పుడూ హీరోగా భావించుకోలేదని, తన అన్నయ్యకు ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతానని చెప్పారు. తనను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదని, చిరంజీవి గురించి మాట్లాడితే వెళ్లి కొట్టేంత కోపం వస్తుందన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వెళ్లారని తెలిపారు.
 
ఇకపోతే, ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ల మధ్య భిన్నమైన భావనలు, వ్యక్తిత్వాలు, ఆలోనలు ఉండడంలో తప్పులేదు. కొందరు వాటిని అర్థం చేసుకోకుండా స్పర్థలని ప్రచారం చేస్తున్నాన్నారు. నాదెప్పుడూ శాంతి మంత్రమే. గొడవకు సిద్ధంగా ఉండను. పదేళ్ల పాటు నా సినిమాలు విజయం సాధించకపోయినా అభిమానుల ప్రేమతో మాత్రమే బతికానని గుర్తు చేశారు. అదేసమయంలో సామాజిక, రాజకీయ మార్పు కోసం పుట్టిందే జనసేన అని మరోమారు పవన్ స్పష్టంచేశారు. దీనిపై మరింత చదవండి :