ఎన్టీఆర్ రెండో కుమారుడి పేరేంటో తెలుసా?

బుధవారం, 4 జులై 2018 (14:13 IST)

ఎన్టీఆర్ ముద్దుల రెండో కుమారుడికి నామకరణం జరిగింది. ఎప్పటికప్పుడూ అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లో వుండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధ్రువీకరించారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి అయ్యారు. రెండోసారి కూడా ఆయన సతీమణి ప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఎన్టీఆర్ వెంటనే అభిమానులతో పంచుకున్నాడు.
 
తాజాగా రెండో బాబుకు నామకరణ మహోత్సవం జరిపారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మొదటి కుమారుడికి అభయ్‌రామ్‌గా పేరు పెట్టిన ఎన్టీఆర్, తన రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేసినట్టుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. 
 
దీనితోపాటు భార్గవ్ రామ్‌ని ఎన్టీఆర్, ప్రణతి, అభయ్ ఆప్యాయంగా చూస్తున్న పిక్‌ను షేర్ చేశాడు. ఈ పిక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేజ్రీకి ఊరట: ఢిల్లీ సర్కారుపై పెత్తనం చెలాయిస్తే కుదరదు.. సుప్రీం సీరియస్

కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వ పాలనాపరమైన విషయాల్లో ఆధిపత్యం చలాయించే అధికారం లేదని ...

news

కొత్తగా మీసాలు మెలేస్తే.. ఉన్నవి కాస్త ఊడుతాయ్: కొండా సురేఖ

తన నియోజకవర్గంలో కొంతమంది మీసాలు మెలేస్తున్నారని.. కొత్తగా మీసాలు మెలేస్తే ఉన్నవి కాస్త ...

news

ప్రియుడితో సంభోగం చేస్తూ యువతి మృతి.. కారణం అదేనట?

ప్రియుడితో సంభోగం చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. ...

news

తల్లి ఒడిలోకి చేరిన పాప.. కోఠీ ఆస్పత్రిలో పాపను కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్

కోఠీ ఆస్పత్రిలో తప్పిపోయిన చిన్నారి అమ్మ ఒడిలోకి చేరుకుంది. బీదర్‌లో పాపను స్వాధీనం ...