మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: సోమవారం, 11 నవంబరు 2019 (13:39 IST)

తృటిలో తప్పిన ప్రమాదం, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైలు పరస్పరం ఢీ

కాచిగూడలో తృటిలో ప్రమాదం తప్పింది. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆగివున్న ట్రైన్‌ను వెనకనుంచి మరొక ఎంఎంటిఎస్ ట్రైన్ ఢీకొంది. విషయం తెలుసుకున్న grp రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు అధికారులు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ డ్రైవర్ మాత్రం క్యాబిన్‌లో చిక్కుకున్నారు.
 
డ్రైవర్ శేఖర్ పరిస్తితి విషమంగా ఉంది. తనను కాపాడండి అంటూ డ్రైవర్ ఆర్తనాదాలు చేయడంతో అతన్ని రక్షించి పనిలో నిమగ్నమైన రైల్వే రెస్క్యూ ఆపరేషన్ టీం. కాచిగూడ రైల్ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. 
క్యాజువాలిటీలో చికిత్స  అందిస్తున్నారు ఉస్మానియా వైద్యులు. 
 
 
గాయపడ్డ వారి వివరాలు,
 
రాజ్ కుమార్
 
మౌనిక
 
అనురాధ
 
మిరాజ్ బేగం
 
ఖాదర్
 
భళేశ్వరమ్మ
 
రాజ్ కుమార్
 
శేఖర్
 
సులోచన
 
మహుమ్మద్ అలీ
 
ఆంజనేయులు
 
రహిముద్దీన్
 
ప్రభాకర్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి.