బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (14:35 IST)

పెళ్లిళ్లు చేసుకుని అక్రమ సంబంధాలు నడుపుతున్నాడా? నాగబాబు ఫైర్

కార్లు మార్చినట్టు పెళ్లాలను మార్చుతున్నాడంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు జగన్ స్థాయికి తగినట్టుగా

కార్లు మార్చినట్టు పెళ్లాలను మార్చుతున్నాడంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు జగన్ స్థాయికి తగినట్టుగా లేవని చెప్పారు. పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి మోసం చేయలేదన్నారు. ఇద్దరి భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది భార్యాభర్తల మధ్య జరిగిన విషయమని తెలిపారు.
 
పైగా, పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని.. దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. ముఖ్యంగా, పవన్ మొదటి భార్యగానీ, రెండో భార్య రేణూ దేశాయ్‌గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు గుర్తుచేశారు. చట్టబద్ధంగా విడిపోయి న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
 
పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. వైవాహిక జీవితంలో కూడా పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, అందువల్లే అలా మాట్లాడుతున్నారన్నారు. కల్యాణ్‌ను టీడీపీ, వైసీపీ తక్కువ అంచనా వేశాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో పవన్ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాడనీ, అందుకే అటు తెలుగుదేశం, ఇటు వైకాపాలు కళ్యాణ్ బాబును టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయని నాగబాబు వ్యాఖ్యానించారు.